కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SS Karthikeya: ‘యానిమల్’‌ని చూసిన ఎస్.ఎస్. రాజమౌళి తనయుని రియాక్షన్ ఇదే..

ABN, First Publish Date - 2023-12-01T18:09:40+05:30

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘యానిమల్’. ప్రమోషనల్ కంటెంట్‌తోనే సినిమాపై బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా ట్రాన్స్‌లో నుండి బయటికి రావడానికి చాలా టైమ్ పట్టిందంటూ దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ట్వీట్ చేశారు.

SS Karthikeya and Ranbir Kapoor

రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘యానిమల్’ (Animal). ప్రమోషనల్ కంటెంట్‌తోనే సినిమాపై బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇందులో ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు జోడీగా నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) నటించగా.. స్టార్ నటులు అనిల్ కపూర్ (Anil Kapoor), బాబీ డియోల్ (Bobby Deol) ఇతరకీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమాని చూసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు.

‘‘రణ్‌బీర్ కపూర్.. మీలోని మాస్ సూపర్‌స్టార్ ఈ యానిమల్‌తో బయటికొచ్చాడు. మీ పెర్ఫార్మెన్స్ జీవితాంతం గుర్తుండిపోతుంది. రష్మిక మందన్నా.. ఇప్పటి వరకు మీరు చేసిన పాత్రలలో బెస్ట్ పాత్ర ఇదేనని భావిస్తున్నాను. సెకండాఫ్‌లో వచ్చే గొడవ సన్నివేశం నాకు బాగా నచ్చింది. ఆ సీన్‌ని అద్భుతంగా చిత్రీకరించారు. సందీప్ వంగా.. మీరు మాత్రమే ఇటువంటి సన్నివేశాలను ఊహించగలరు. మీరు సృష్టించిన ట్రాన్స్ నుంచి బయటికి రావడానికి చాలా టైమ్ పట్టింది’’ అని కార్తికేయ తన ట్విట్టర్‌లో ‘యానిమల్’ సినిమాపై రియాక్ట్ అయ్యారు. (SS Karthikeya About Animal)


‘యానిమల్’ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) కూడా సినిమాపై, టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘‘సందీప్‌ని చూస్తుంటే చాలా గర్వంగా వుంది. యానిమల్ టీజర్ వచ్చిన వెంటనే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలనిపించింది. రణ్‌బీర్ కపూర్ ఇంటెన్స్ యాక్టర్. బాలీవుడ్‌లో నా ఫేవరేట్ యాక్టర్ తను. తనలో చాలా ఇంటెన్సిటీ వుంటుంది. తన ప్రతిభ చూపించుకునే సినిమాలు చాలా తక్కువ పడ్డాయని నా అభిప్రాయం. యానిమల్‌తో రణ్‌బీర్ కపూర్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలోకి వెళ్తారని భావిస్తున్నాను. యానిమల్ కోసం టీం చాలా హార్డ్ వర్క్ చేసింది. చాలా అద్భుతంగా సినిమా వచ్చింది’’ అని రాజమౌళి ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు. భూషణ్ కుమార్ అండ్ క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా ‘యానిమల్’ చిత్రాన్ని నిర్మించాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Avika Gor: అలాంటి వారంతా ‘వధువు’ కోసం ఓటీటీకి వస్తారు

****************************************

*Bachchala Malli: ‘పుష్ప’, ‘టైగర్ నాగేశ్వరావు’ బాటలో అల్లరి నరేష్.. క్లాప్ కొట్టేశారు

************************************

*చిత్రపరిశ్రమలో మాత్రమే కులమత భేదాలు లేవంటోన్న దర్శకుడు

************************************

Updated Date - 2023-12-01T18:37:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!