సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Singer Sunitha: ప్రెగ్నెన్సీ వార్తలపై తొలిసారి స్పందించిన సింగర్ సునీత

ABN, First Publish Date - 2023-02-14T20:04:10+05:30

గత కొన్ని రోజులుగా సింగర్ సునీత‌ (Singer Sunitha)పై ఓ రూమర్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ రూమర్‌పై తొలిసారి సింగర్ సునీత..

Singer Sunitha
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొన్ని రోజులుగా సింగర్ సునీత‌ (Singer Sunitha)పై ఓ రూమర్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ రూమర్‌పై తొలిసారి సింగర్ సునీత స్పందించారు. ఈ నెల 26వ తేదీన మాస్ట్రో ఇళయరాజా నిర్వహించనున్న లైవ్ కన్సర్ట్‌కు సంబంధించి మాట్లాడిన సునీతను.. ఇటీవల మీపై ఓ రూమర్ వైరల్ అయ్యింది కదా.. దానిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అని ప్రశ్నించగా.. ‘నా పై ఏం రూమర్ ఉందో నిజంగా నాకు తెలియదు..’ అంటూ సమాధానమిచ్చారు. మీరు ప్రెగ్నెంట్ (Pregnancy) అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి కదా.. ఆ రూమర్ గురించి మీరు ఏం చెబుతారని ABN ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అడుగగా.. ‘‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు..’’ అని సునీత చెప్పుకొచ్చారు. దీంతో చాలా రోజులుగా మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూమర్‌కు ఆమె బ్రేక్ వేసినట్లయింది. (Sunitha About Pregnancy Rumour)

‘వాలెంటైన్స్ డే’ (Valentine’s Day) సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారని ప్రశ్నించగా.. ‘‘స్పెషల్ ఏమీ లేదు. ప్రతిరోజూ లానే నాకు ఈ రోజు కూడా. ఇంకా సెలబ్రేషన్ అంటారా.. అలా చూస్తే నాకు ప్రతి రోజూ వాలెంటైన్స్ డే నే. నేను ఇంటికి వెళ్లే సరికి నా భర్త.. పూల బొకేతో స్వాగతం పలకాలని నేను ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. వీలైతే నేను ఆయన కోసం ఫ్లవర్స్ తీసుకెళతాను. ఎందుకు బాయ్స్ మాత్రమే ఇవ్వాలని లేడీస్ అనుకుంటున్నారు. వీలైతే దానిని మార్చేద్దాం. గాళ్స్ అందరూ వారి ప్రేమికులకు, బ్రదర్స్, ఫాదర్స్‌.. ఇలా ఎవరుంటే వారికి ఫ్లవర్స్ ఇవ్వాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.

ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ఇళయరాజా మ్యూజిక్ లైవ్ కన్సర్ట్ (Ilayaraja live music concert in Hyderabad) గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ కన్సర్ట్ సంథింగ్ వెరీ స్పెషల్. కొత్తగా అని చెప్పను కానీ.. చాలా ప్రత్యేకమైనదీ కన్సర్ట్. రాజా సార్‌కి ప్రస్తుతం 80 సంవత్సరాలు. కానీ ఒక 1000 సంవత్సరాలకు సరిపడినంత నిధిని ఆయన మనకి అందించారు. ఒక సింగర్‌గా ఈ కన్సర్ట్‌లో పాడబోతున్నందుకే కాకుండా.. ఇళయరాజాగారి వీరాభిమానిగా ఇది నాకు చాలా స్పెషల్ అని మాత్రం చెబుతాను..’’ అని తెలిపారు. ఇంకా ఈ కన్సర్ట్‌కి సంబంధించిన అనేక విషయాలను ఆమె చెప్పుకొచ్చారు. అవేంటో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.

Updated Date - 2023-02-14T20:04:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!