కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shruti Haasan: శృతి హాసన్‌కి చెమటలు పట్టించిన అజ్ఞాత వ్యక్తి..

ABN, First Publish Date - 2023-09-19T22:15:03+05:30

హీరోయిన్ శృతి హాసన్‌కు ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి చుక్కలు చూపించాడు. రీసెంట్‌గా దుబాయ్‌లో జరిగిన ‘సైమా’ అవార్డ్స్ వేడుకలలో పాల్గొని.. తిరిగి ముంబై చేరుకున్న శృతి హాసన్‌ను.. ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి భయపెట్టేశాడు. ఇంతకీ అతను ఎవరనేది మాత్రం తెలియరాలేదు.

Heroine Shruti Haasan

హీరోయిన్ శృతి హాసన్‌ (Shruti Haasan)కు ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి చుక్కలు చూపించాడు. రీసెంట్‌గా దుబాయ్‌లో జరిగిన ‘సైమా’ (SIIMA) అవార్డ్స్ వేడుకలలో పాల్గొని.. తిరిగి ముంబై చేరుకున్న శృతి హాసన్‌ను.. ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి (Unknown Person) భయపెట్టేశాడు. పేరుకు అభిమాని అని చెప్పినా.. అదే పనిగా వెంబడించడంతో శృతి హాసన్ పరుగులు తీయక తప్పలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

ముంబై ఎయిర్ పోర్టులో (Mumbai Airport) ఒక వ్యక్తి తనని ఫాలో అవడం గమనించిన శృతి హాసన్.. భయపడి ఫాస్ట్‌గా నడవడం మొదలెట్టింది. అయినా కూడా ఆ వ్యక్తి వెంబడిస్తూనే ఉండటంతో.. ఎవరు నువ్వు? అని మధ్యలో శృతి ఆగి అతనిని ప్రశ్నించగా.. అతను కామ్‌గా పక్కకి వెళ్లిపోయాడు. శృతి హాసన్ కాస్త ఊపిరి పీల్చుకుని నడుస్తుండగా.. మళ్లీ అతను ఆమెనే ఫాలో అవుతూ కనిపించాడు. దీంతో వేగంగా ఎయిర్ పోర్ట్ బయటికి వచ్చేసి.. కారు ఎక్కేసి శృతి హాసన్ వెళ్లిపోయింది. ఆమె కారు ఎక్కే వరకు కూడా అతను ఫాలో అవుతూనే ఉండటంతో శృతి హాసన్ భయపడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ అతను ఎవరనేది మాత్రం తెలియరాలేదు. (Shruti Haasan Scared)


శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే.. ఈ సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో వరుస సక్సెస్‌లను అందుకుంది శృతి హాసన్. ఈ సక్సెస్ చిత్రాల తర్వాత తనకి వరుస ఆఫర్లు వస్తాయని భావించింది.. కానీ, అంతగా ఆమెకు అవకాశాలు వరించలేదు. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ (Salaar) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*RAM: పవర్‌ఫుల్ డైలాగ్‌తో‌ వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ మిషన్ గ్లింప్స్

****************************************

*Martin Luther King: అక్కడ యోగిబాబు అరిపించేశాడు.. ఇక్కడ సంపూ ఏం చేస్తాడో...?

***************************************

*Devil: సింగర్ సిద్ శ్రీరామ్.. మరోసారి మాయ చేసేశాడు

***************************************

*Jailer Villain Vinayakan: రెమ్యూనరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన ‘జైలర్‌’ విలన్‌

**************************************

Updated Date - 2023-09-19T22:15:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!