కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BiggBoss 7 : శోభా ఆట వర్కవుట్‌ కాలేదు.. బయటకు పంపేశారు

ABN, First Publish Date - 2023-12-11T10:54:16+05:30

బిగ్‌బాస్‌ సీజన్‌-7 చివరి దశకు చేరుకుంది. మరోవారం రోజుల్లో సీజన్‌ పూర్తి కానుంది. ఈ వారం ఎలిమినేషన్‌ పూర్తయింది. అందరూ ఊహించినట్లుగానే నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన శోభాశెట్టి ఎలిమినేట్‌ అయింది

బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Biggboss 7)చివరి దశకు చేరుకుంది. మరోవారం రోజుల్లో సీజన్‌ పూర్తి కానుంది. ఈ వారం ఎలిమినేషన్‌ పూర్తయింది. అందరూ ఊహించినట్లుగానే నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన శోభాశెట్టి (Shobha SHetty) elimination) ఎలిమినేట్‌ అయింది. ఆదివారం ఆమె హౌస్‌ నుంచి బయటకు వచ్చేసింది. గత వారమే ఆమెకు సీన్‌ మొత్తం అర్థమైపోయింది. ఇంట్లో పరిణామాలు చూసుకున్న ఆమె ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది తానే అని అర్థమై సేవ్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ అవేమి ఫలించలేదు 

ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఇంట్లో యావర్‌, శివాజీ, పల్లవి ప్రశాంత్ , అమర్‌, అర్జున్‌, ప్రియాంక మిగిలారు. వీరే ఫైనలిస్ట్‌లని నాగార్జున వెల్లడించారు. హౌస్‌ నుంచి వేదికపైకి వచ్చిన శోభ తన జర్నీ చూసి భావోద్వేగానికి గురైంది. హౌస్‌లో తన అనుభవాలను పంచుకుంది. అనంతరం ఇంటి సభ్యుల్లో గుడ్‌ సైడ్‌, బ్యాడ్‌సైడ్‌ ఏంటో చెప్పాలని నాగ్‌ ఆదేశించారు.

శోభా ఏం చెప్పారంటే...

ప్రశాంత్‌: అన్నీ మంచి విషయాల, పరిస్థితులను బట్టి రియాక్ట్‌ అవుతాడు.

శివాజీ: హౌస్‌లో పరిస్థితులను బట్టి కోపాన్ని ఎదుటివారిపై చూపించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆయన ప్రవర్తిస్తుంటారు. మంచి గైడ్‌.

అమర్‌: ట్రోఫీ తీసుకుని అనంతపురానికి వెళ్లాలి. ఆవేశం వదిలేయాలి.

అర్జున్‌: బ్యాడ్‌సైడ్‌ అంటూ ఏమి లేదు. కాకపోతే, గతవారం ఓటింగ్‌లో లాస్ట్‌లో ఉన్నానని నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాడు. దాని నుంచి బయటకు రావాలి.

ప్రియాంక: బాగానే ఆడుతుంది. గొడవ పడినా తొందరగా కలిసిపోతుంది. ఏదైనా చెప్పేటప్పుడు మన మాట వినదు. అదొక్కటే బ్యాడ్‌.

యావర్‌: ఆట విషయంలో అతనికి కాన్ఫిడెన్స్‌ ఉంది. ఎదుటి మనుషులను మాత్రం అర్థం చేసుకోడు.

ఈ 14 వారాల జర్నీలో హౌస్‌లో ఉన్న వాళ్ల దగ్గరి నుంచి మీరు నేర్చుకున్న లక్షణం ఏంటి’ అని నాగార్జున అడగ్గా, హౌస్‌మేట్స్‌ ఇతరుల నుంచి ఏం నేర్చుకున్నారో చెప్పుకొచ్చారు.

ప్రియాంక: అమర్‌ ఫౌల్‌ గేమ్స్‌ ఎక్కువ ఆడతాడు. అలా ఆడకూడదన్న విషయం అతడి దగ్గర నేర్చుకున్నా.

అర్జున్‌: ఇతరులతో లౌక్యంగా ఎలా ఉండాలో శివాజీ దగ్గరి నుంచి నేర్చుకున్నా. తప్పు జరిగినా సాధించాలనే పట్టుదల యావర్‌ను చూసి నేర్చుకున్నా. గొడవ పడినా కూడా వచ్చి సారీ చెప్పటం ప్రశాంత్‌ను చూసి నేర్చుకున్నా. అందరితోనూ నవ్వుతూ ఎలా మాట్లాడాలో ప్రియాంక చూసి తెలుసుకున్నా. కానీ ఆచరించడం కుదరడం లేదు.

శోభశెట్టి : ఎవరి దగ్గరా ఏమీ నేర్చుకోలేదు. పరిస్థితులను బట్టి అందరూ మారిపోతుంటారు. ఫోన్‌ లేకుండా బతకగలనని మాత్రం ఇక్కడ నేర్చుకున్నా. బయటకు వెళ్లాక కూడా ఫోన్‌ వాడకాన్ని తగ్గిస్తా.

శివాజీ: యావర్‌లో ఒక గొప్ప గుణం ఉంది. తోటివారు భోజనం చేయలేదంటే వారి కోసం దాచిపెట్టి మరీ పెడతాడు. అలాగే తనకు కావాల్సింది అడిగి తీసుకుంటాడు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని చెబుతాడు.

అమర్‌: గేమ్‌ విషయంలో ప్రశాంత్‌ చాలా సూటిగా ఉంటాడు. ఏ పని చేసినా అది అవసరం. ఇక అర్జున్‌ అన్న ఆట ఆడేటప్పుడు తప్పు అని తెలిేస్త, పక్కకు వచ్చేస్తాడు. ఆ నిజాయతీ నేర్చుకున్నా.

యావర్‌: ఓపికతో ఎలా ఉండాలో శివాజీని చూసి నేర్చుకున్నా. ప్రతిదాన్ని సాగదీయకూడదని తెలుసుకున్నా.

ప్రశాంత్‌: ఎదుటి వాళ్లు బాధలో ఉన్నప్పుడు మనం నవ్వితే వాళ్లు కూడా ఆ బాధ నుంచి బయట పడతారని శివాజీ నుంచి నేర్చుకున్నా.

Updated Date - 2023-12-11T10:57:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!