సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rakesh Master: గురువు రాకేశ్ మాస్టర్ భౌతికకాయం చూసి కన్నీరుమున్నీరైన శిష్యులు

ABN, First Publish Date - 2023-06-19T22:20:43+05:30

కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆకస్మిక మరణ వార్త విని అంతా షాకయ్యారు. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్‌తో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన ఆయన శిష్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయనకు ఎంతో ఇష్టమైన శిష్యుడిగా పేరున్న శేఖర్ మాస్టర్.. రాకేశ్ మాస్టర్ మృతదేహం చూసి భోరున విలపించారు.

Sekhar and Jani Masters at Rakesh Master Final Rites
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh Master) ఆకస్మిక మరణ వార్త విని అంతా షాకయ్యారు. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్‌తో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాకేశ్ మాస్టర్ శిష్యులైన శేఖర్ మాస్టర్ (Sekhar Mastar), జానీ మాస్టర్ (Jani Master) వంటి వారంతా ఇంటికి వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. గురువు భౌతికకాయాన్ని చూసి ఆయన శిష్యులంతా విలపిస్తున్నారు. ముఖ్యంగా శేఖర్, జానీ మాస్టర్ కన్నీరుమున్నీరవుతోన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.

రీసెంట్‌గా ఒక వారం పాటు వైజాగ్‌లో షూటింగ్‌లో పాల్గొని వచ్చిన రాకేశ్ మాస్టర్‌కు.. సడెన్‌గా రక్త విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆయనని ప్రైవేట్ హాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి మరింతగా విషమించడంతో.. ఆదివారం (జూన్ 18) సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ హాస్పిటల్‌తో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం రాకేశ్ మాస్టర్ మృతి చెందారు. తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న రాకేశ్ మాస్టర్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, షుగర్ లెవల్స్ పడిపోవడంతో మృతి చెందినట్లుగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. రాకేశ్ మాస్టర్ మరణవార్త తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనైంది. ఆయన గురించి తెలిసిన వారంతా.. రాకేశ్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

రాకేశ్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న సమయంలో ఎందరో ఆయనకు శిష్యులుగా ఉన్నారు. వారంతా నేడు స్టార్ కొరియోగ్రాఫర్స్‌గా పేరు తెచ్చుకుని.. ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. రాకేశ్ మాస్టర్ మరణ వార్త వినగానే వారంతా ఆయన ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు. రాకేశ్ మాస్టర్ బ్రతికున్నప్పుడు.. తనకి ఎంతో ఇష్టమైన శిష్యుడని చెప్పుకున్న శేఖర్ మాస్టర్.. గురువు పార్థివదేహం చూసి.. భోరున విలపించారు. అయితే చివరి రోజుల్లో శేఖర్ మాస్టర్‌పై రాకేశ్ మాస్టర్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘‘నేను చనిపోయిన తర్వాత.. నా శవాన్ని శేఖర్ ముట్టకూడదు’’ అంటూ ఆయన చేసిన కామెంట్స్‌ని పట్టించుకోకుండా.. శేఖర్ మాస్టర్ దగ్గరుండి అంత్యక్రియలు జరిపించినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Mega Festival: మెగాభిమానులారా.. టైమ్ గుర్తు పెట్టుకోండి.. మంగళవారం 6 గంటల 30 నిమిషాలకు..


**************************************

*Bhagavanth Kesari: చిలకపచ్చ కోక.. కాజల్, శ్రీలీల చింపి ఆరేశారు


**************************************

*Kajal Aggarwal: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి బర్త్‌డే ట్రీట్..

**************************************

*Adipurush Collections: ఆ రెండూ ఊహించినవే కానీ.. ఈ ఏరియాలో మాత్రం ప్రభాస్‌కి కోలుకోలేని దెబ్బే!

**************************************

*Sitara: చిచ్చర పిడుగులా చెలరేగిపోతోన్న మహేష్ తనయ.. సాయిపల్లవిని దించేసింది

**************************************

Updated Date - 2023-06-19T22:25:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!