Sandeep Reddy Vanga: పక్కా తెలంగాణ బిడ్డని.. ఆ రోజులు తలుచుకుంటే భయమేస్తుంది
ABN, First Publish Date - 2023-11-26T14:18:21+05:30
నేను పక్కా తెలంగాణ బిడ్డను. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు కూడా తెలంగాణనే!.. అని అన్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. మొత్తంగా 5 భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆయన తన నేపథ్యం గురించి చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. మొత్తంగా 5 భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ వంగా తన నేపథ్యం గురించి చెప్పుకొచ్చారు. తను పక్కా తెలంగాణ బిడ్డనని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..
‘‘నేను పక్కా తెలంగాణ బిడ్డను. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు కూడా తెలంగాణనే! నేను 8వ తరగతి వరకూ వరంగల్‌లో చదివా. ఆ తర్వాత ఇంటర్ హైదరాబాద్‌లో.. డిగ్రీ ధార్వాడ్‌లో చేశా. సిడ్నీ ఫిల్మ్ స్కూల్‌లో చదువుకున్నా. చిన్నప్పటి నుంచి నాకు ఫొటోగ్రఫీ అన్నా.. పెయింటింగ్ అన్నా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఫిల్మ్‌మేకింగ్‌లోకి దింపింది. నేను హైదరాబాద్ వచ్చి సినిమా రంగంలోకి అడుగుపెట్టే సమయానికి నాకు ఒక్కరు కూడా తెలియదు. కానీ ఏదో చేయాలనే మొండి ధైర్యం. అమ్మనాన్న కూడా ‘వీడు ఇలాగే ఉంటే పిచ్చివాడైపోతాడు.. సినిమాలోకి వెళ్తేనే బెటర్’ అనుకున్నారు. అలా అర్జున్‌రెడ్డి మొదలుపెట్టా.
ఆ కథ ఎవరికి చెప్పినా అర్థం కాదు. అందుకే మేమే ప్రొడ్యూసర్‌లుగా మారి ఆ సినిమా ప్రారంభించాం. అప్పటికి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కొత్త. తన ‘పెళ్లి చూపులు’ సినిమా ఇంకా విడుదల కాలేదు. ‘ఎవడే సుబ్రమణ్యం’ మాత్రమే విడుదలైంది. తను కూడా ఏదో కొత్తగా చేయాలనుకుంటున్నాడు. నేనూ అంతే! మూడు కోట్లు అనుకొని సినిమా ప్రారంభించాం. ‘నీకు పిచ్చా.. ఇంత డబ్బులు ఎందుకు పెడుతున్నావు.. సినిమా అంటే అసలు నీకు తెలుసా? 500 సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అసలు నీ సినిమా రిలీజ్ అవుతుందనుకుంటున్నావా?’ అన్నవాళ్లు కూడా ఉన్నారు. కానీ నా మీద నాకు నమ్మకం. చావో.. రేవో తేల్చుకుందామనుకున్నా. ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే భయమేస్తుంది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ‘నీకు ఆంధ్రా తెలుగు రాదు కదా.. డైలాగ్స్ ఎట్లా రాస్తావు?’ అనేవారు. నేను చాలా ఆలోచనలో పడిపోయేవాడిని. అవసరమైతే డైలాగ్ రైటర్‌ను పెట్టుకుందామనుకున్నా. అయితే అర్జున్‌రెడ్డి (Arjun Reddy)కి డైలాగ్స్ ఒక ఫ్లోలో రాసుకుంటూ వెళ్లిపోయా! విజయ్ కూడా తెలంగాణ కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాలేదు. డైలాగ్స్ చాలా సహజంగా అనిపించాయి. మళ్లీ తెలుగులో సినిమా తీసినప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి..’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
====================
*Geethanjali Sequel: ‘గీతాంజలి’తో అంజలి మళ్లీ వస్తోంది
******************************
*Sandeep Reddy Vanga: మహేష్ బాబుకి ఒక కథ చెప్పా.. కానీ?
******************************
*Srikanth: ఈ మధ్యకాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్రశంసలు రాలేదు
*******************************
*Sandeep Reddy Vanga: నటసింహం బాలయ్యకి ఫ్యాన్ అయిపోయా..
********************************