కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sandeep Reddy Vanga: నటసింహం బాలయ్యకి ఫ్యాన్ అయిపోయా..

ABN, First Publish Date - 2023-11-25T22:50:45+05:30

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. మొత్తంగా 5 భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు సందీప్ వంగా పాల్గొన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షో ఎలా ఉందో తాజాగా ఆయన చెప్పుకొచ్చారు.

Balakrishna and Sandeep Vanga

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. మొత్తంగా 5 భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ అండ్ క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. రీసెంట్‌గా ‘యానిమల్’ చిత్రయూనిట్ ఆహాలో నందమూరి నటసింహం బాలయ్య (NBK) చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షో‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షో‌లో బాలయ్య (Balayya)ని కలవడం ఎలా అనిపించింది? అనే ప్రశ్న.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు తను పాల్గొన్న తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ..


‘‘అన్‌స్టాపబుల్ షో చూసి షాక్ అయ్యాను. ఈ కార్యక్రమం (Unstoppable with NBK) ఎవరు డిజైన్ చేశారో కానీ వాళ్లకు హ్యాట్సాప్. ఎందుకంటే బాలయ్యబాబు అంటే సీరియస్‌గా వుంటారనే టాక్ వింటూ ఉంటాం. కానీ ఈ షో బాలయ్య‌గారిని చూసిన తర్వాత ఆయన ఎంత సరదాగా వున్నారో అని అనిపించింది. బాలకృష్ణగారు చెప్పిన మొఘల్-ఈ-ఆజం డైలాగులకు రణ్‌బీర్ కపూర్ మతిపోయింది. అది రణ్‌బీర్ కపూర్ ముత్తాత సినిమా. అందులో డైలాగులు రణ్‌బీర్‌కి కూడా గుర్తు లేవు. బాలకృష్ణగారు చెప్పిన డైలాగులు విని నేను ఆలోచనలో పడిపోయాను. అసలు అంత మెమరీ ఎలా వుంటుందని షాక్ అయ్యాను. మామూలు డైలాగులు కావు అవి. బాలకృష్ణ‌గారి ఫ్యాన్ అయిపోయా. తెలుగులో కాదు నార్త్‌లో కూడా ఇప్పుడా డైలాగులు ఎవరికీ గుర్తుండవు. కొత్తగా ఆడిషన్స్‌కి వెళ్ళే నటులు కూడా ఆ డైలాగులు చెప్పరు. ఎందుకంటే అవి చాలా కష్టమైనవి..’’ అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sandeep Reddy Vanga: మహేష్ బాబుకి ఒక కథ చెప్పా.. కానీ?

******************************

*Srikanth: ఈ మ‌ధ్య‌కాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్ర‌శంస‌లు రాలేదు

*******************************

*Surya: డాడీతో పోలిక లేదు.. ఆ పేరు కూడా వాడుకోనంటోన్న విజయ్‌ సేతుపతి కుమారుడు

*******************************

Updated Date - 2023-11-25T22:50:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!