Samantha: వివాహం, ఆరోగ్యం, సినిమాలు అన్నీ ఒకేసారి ఫెయిల్ అయినప్పుడు బాధపడ్డాను
ABN, First Publish Date - 2023-11-09T12:22:16+05:30
సమంత మొదటి సారిగా తన వైవాహిక జీవితం, అలాగే వ్యాధి, సినిమాలు గురించి మాట్లాడింది. ఆ సమయంలో తానేమి చేసిందో చెప్పింది, అలాగే నటీనటులు అంటే తమకి కూడా నొప్పి, బాధలు, కష్టాలు వుంటాయని చెప్పింది.
అగ్ర నటీమణుల్లో ఒకరైన సమంత ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. మయోసిటిస్ (Myositis) అనే వ్యాధినుండి కోలుకుంటున్నారు. సినిమాలు చెయ్యకపోయినా సాంఘీక మాధ్యమంలో చురుకుగా ఉంటూ, తన అభిమానులకు తాను ఏమి చేస్తోందో చెపుతూ వుంటారు. అలాగే సమంత (Samantha) తన వ్యాధి గురించి, తన వైవాహిక జీవితం గురించి ఎప్పుడూ మీడియాతో మాట్లాడలేదు. కానీ ఈసారి ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన గురించి తాను అన్ని విధాలా కుంగిపోయినప్పుడు ఏమి చేసిందో కూడా చెప్పింది. SamanthaMarriage
"నేను ఒక టైములో పూర్తిగా కుంగిపోయాను. నా వైవాహిక జీవిత విఫలం అయింది, ఆరోగ్యం క్షీణించింది, అదే సమయంలో నేను చేసిన సినిమాలు కూడా సరిగ్గా ఆడకపోవడంతో, ఈ మూడింటిలో నేను ఫెయిల్ అయినప్పుడు చాలా బాధపడ్డాను. అటువంటి సమయంలో, నేను పుస్తకాలు చదవటం మొదలెట్టారు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని, మళ్ళీ సినిమాలు చేసిన నటుల గురించి, ట్రోలింగ్ కి గురి అయి, డిప్రెషన్ కి గురైన వారు ఎలా కోలుకున్నారు వాళ్ళ గురించి పుస్తకాలు చదివాను. వాళ్ళు ఎలా మళ్ళీ తిరిగి పైకొచ్చారో వారి కథలు చదవడం నాకు ఎంతో ఉపయోగపడింది," అని చెప్పింది సమంత. #SamanthaOnherHealth
"వాళ్లు అందరూ చెయ్యగలిగినప్పుడు నేను ఎందుకు చెయ్యలేను, నేను కూడా చేయగలనని అనుకున్నాను, అదే నాకు కొండత బలాన్నిచ్చింది. ఒక పెద్ద స్టార్‌గా ఉండటం ఒక అందమైన బహుమతి అని అనుకుంటాను, అందుకే నటిగా నేను బాధ్యతగా వుంటాను, నిజాయితీగా వుంటాను. నటీనటులు అంటే ఎన్ని సూపర్ హిట్లు, బ్లాక్బస్టర్లను ఇచ్చారు, ఎన్ని అవార్డులు గెలుచుకున్నారు, అందంగా వున్నారా లేదా, అందమైన దుస్తులు వేసుకున్నరాలేదా, ఇవన్నీ కాదు, మాకు కూడా నొప్పి, కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. నా జీవితంలో జరిగే ఒడిడుకులు అందరికీ తెలిసిపోతున్నాయని నేను పట్టించుకోను, అలాగే నాలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులు చాలామంది వుంది వుంటారు, వాళ్ళకి కూడా పోరాడే శక్తిని కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నాను," అని చెప్పింది.