Samantha: హెయిర్ స్టైలిస్ట్ భావోద్వేగ పోస్ట్.. మళ్లీ వచ్చేది ఎప్పుడో!
ABN, First Publish Date - 2023-07-14T13:08:52+05:30
టాలీవుడ్ స్టార్ హీరోయినన్ సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వనుందనే వార్తలు కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజమేనని తెలిసింది. త్వరలో సమంత చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు ఆమె హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వనుందనే వార్తలు కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజమేనని తెలిసింది. త్వరలో సమంత చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు ఆమె హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ (hair stylist rohit bhatkar) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఆమెతో దిగినఫొటోలు షేర్ చేసి సమంత వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
‘‘రెండేళ్లు...
1 సెన్షేషనల్ మ్యూజిక్ వీడియో..
3 సినిమాలు
7 బ్రాండ్ క్యాంపెయిన్స్..
2. ఎడిటోరియల్స్
జీవితకాలం జ్ఞాపకాలను పోగేసుకున్నాం.
ఎండా, వానా లెక్క చేయకుండా పనిచేశాం. ఎన్నో నవ్వులు, కన్నీళ్లు, బాధలు.. అన్నింటిని చిరునవ్వుతో స్వీకరించాం. ఎన్నో ఎత్తుపల్లాలను చూశాం. నమ్మకంగా ధైర్యంగా ముందుకెళ్లాం. ఫైనల్‌గా బ్యూటిఫుల్ జర్నీ చేశాం.
వైద్యం తీసుకునే సమయంలో మీకు మరింత బలం, శక్తి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంతకు ముందు కంటే రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తున్నాను. ఇలాంటి సమయంలో మీలో నుంచి ఇప్పటి వరకూ బయటకు రాని డైమెన్షన్ బయటకు రావాలి. తద్వారా మీరు ధృడంగా ఉండాలి. అడవి మంటల్లో కూడా పెరిగే పువ్వు మీరు. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం’’ అని రాసుకొచ్చారు. తన హెయిర్ స్టైలిస్ట్ చేసిన పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసి భావోద్వేగంగా ఉండే ఎమోజీలను షేర్ చేశారు.
ఇటీవల సమంత ‘సిటడెల్’(Citadel) వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేశారు. అలాగే తెలుగులో నటిస్తున్న ‘ఖుషి’ (Kushi)సినిమా కూడా పూర్తయింది. ‘సిటడెల్’లో తన పోషించిన పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుందని, ఇప్పటి వరకూ తన బెస్ట్ ఇదేనని సామ్ తెలిపారు.