కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Razakar: సినిమా బ్యాన్‌పై సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన ‘రజాకార్’ నిర్మాత

ABN, First Publish Date - 2023-10-30T19:40:39+05:30

స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇందులో ఉన్న కంటెంట్ ఓ మతాన్ని కించపరిచేలా ఉందని సీఈఓకు ఫిర్యాదు వెళ్లడంతో నిర్మాత నేరుగా సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసి సినిమా వివరాలను తెలియజేశారు.

Producer Gudur Narayan Reddy

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ (Samarveer Creations) బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ (Yata Satyanarayana) ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి (Gudur Narayan Reddy) నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’ (Razakar). ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇందులో ఉన్న కంటెంట్ ఓ మతాన్ని కించపరిచేలా ఉందని.. ఈ టైమ్‌లో సినిమా విడుదలైతే.. ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ.. కొందరు సీఈఓకు ఫిర్యాదు చేసినట్లుగా వచ్చిన వార్తలతో.. నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి నేరుగా ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ (CEO Vikas Raj)ను కలిసి సినిమా గురించి వివరణ ఇచ్చారు.


‘‘జరిగిన చరిత్రను, వందకు పైగా పుస్తకాల ఆధారంగా చిత్రం నిర్మించాం. ఒక నిమిషం 40 సెకండ్ల వీడియో చూసి చిత్రాన్ని బ్యాన్ చేయమని అనడం కరెక్ట్ కాదు. ప్రత్యేకంగా ఒక మతాన్ని ఉద్దేశించి తీసిన సినిమా అయితే ఇది కాదు. 1947 నుంచి 1948 వరకు జరిగిన మారణహోమం గురించి సినిమాలో చూపిస్తున్నాం. ఆనాటి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సొంత ప్రజల మీదనే నరహంతకుల లెక్క దాడి చేశారు. చాలా మంది సినిమా గురించి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సినిమా గురించి పూర్తిగా ఎన్నికల కమిషనర్‌కు వివరించగా.. సినిమాను బ్యాన్ చేసే ఎటువంటి రూల్ ఎలక్షన్ రూల్ బుక్‌లో లేదని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. కాబట్టి.. సినిమా గురించి ప్రతీ ఒక్కరూ నిజాలు తెలుసుకోవాలని విజ్ఞపి చేస్తున్నాను’’ అంటూ ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసి నిర్మాత గూడూరు నారాయ‌ణ రెడ్డి (Gudur Narayan Reddy Producer) చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

========================

*Hard-Hitting Love Story: కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి.. ‘బేబీ’ మేకర్స్ తగ్గేదే లే..

*******************************

*Vignesh Shivan: ఆ సినిమా మా బ్యానర్‌కు దక్కిన సముచిత గౌరవం

*********************************

*Vijay Deverakonda: మా అందరినీ కలిపింది సినిమానే..

**********************************

Updated Date - 2023-10-30T19:40:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!