Skanda: ‘స్కంద’ వినాయక చవితికి రావట్లేదు.. ఎప్పుడో తెలుసా?
ABN, First Publish Date - 2023-09-06T15:31:20+05:30
బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘స్కంద’. ఈ సినిమాని వినాయక చవితి స్పెషల్‌గా సెప్టెంబర్ 15న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఇప్పుడు ‘సలార్’ వాయిదా పడటంతో ఆ తేదీన అంటే సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.
బోయపాటి శ్రీను (Boyapati Sreenu), ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘స్కంద’ (Skanda). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, అలాగే రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో బోయపాటి మార్క్ అడుగడుగునా కనిపించింది. అలాగే రామ్ కూడా డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకర్షించారు. ఈ సినిమాని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడీ సినిమాను వాయిదా వేసినట్లుగా తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. (Skanda Postponed)
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లుగా తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో రామ్, హీరోయిన్ శ్రీలీల (Sreeleela) సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. పంచెకట్టులో రామ్ చాలా కూల్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల గాగ్రా చోళీలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఇద్దరినీ అలా చూస్తుంటే అక్కడొక పండగ వాతావరణం కనిపిస్తుంది. పోస్టర్ సంగతి ఇలా ఉంటే.. ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ గుర్తుందా.. సెప్టెంబర్ 28. ఈ డేట్‌కి వాస్తవానికి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar) చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమా నవంబర్ లేదంటే.. రాబోయే సంక్రాంతికి విడుదల అనేలా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ డేట్‌ని ‘స్కంద’కు లాక్ చేశారు.
మాస్ విస్పోటనంతో పాటు అద్భుతమైన కుటుంబ భావోద్వేగాలతో అలరించిన స్కంద ట్రైలర్‌తో.. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా.. బోయపాటి, రామ్ కాంబో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
============================
*MSMP Recipe Challenge: అనుష్క టు ప్రభాస్.. ప్రభాస్ టు రామ్ చరణ్
*************************************
*Balagam: ‘బలగం’ పెద్దమనిషి ఇక లేరు..
************************************
*Sachin Tendulkar: మురళీధరన్ జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి
*************************************
*Harish Shankar: ఆ కత్తులేంటి సామి.. భయపెట్టేస్తున్నావ్‌గా..!
*************************************