కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MSMP Recipe Challenge: ఛాలెంజ్ స్వీకరించి.. ఇష్టమైన రెసిపీ ఏంటో తెలిపిన రామ్ చరణ్

ABN, First Publish Date - 2023-09-07T01:30:36+05:30

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్‌లో భాగంగా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి (స్వీటీ). ఈ సినిమాలో చెఫ్ అన్విత ర‌వళి శెట్టి క్యారెక్టర్‌లో నటించిన అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్’ ప్రారంభించింది. తనకి ఇష్టమైన వంటకం ఎలా చేయాలో తెలిపిన అనుష్క.. ఈ ఛాలెంజ్‌ని ప్రభాస్‌కి విసిరింది. ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించి.. రామ్ చరణ్‌కి విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన చరణ్.. తన ఇష్టమైన వంటకాన్ని షేర్ చేశారు.

MSMP Recipe Challenge: ఛాలెంజ్ స్వీకరించి.. ఇష్టమైన రెసిపీ ఏంటో తెలిపిన రామ్ చరణ్
Anushka and Ram Charan

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Ms Shetty Mr Polishetty) ప్రమోషన్‌లో భాగంగా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి (స్వీటీ). ఈ సినిమాలో చెఫ్ అన్విత ర‌వళి శెట్టి క్యారెక్టర్‌లో నటించిన అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్’ (MSMP Recipe Challenge) ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలు మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోస రెసిపీలను ఎలా తయారు చేయాలో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. అనంతరం అనుష్క (Anushka) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas)కు ఈ ఛాలెంజ్ ఇవ్వగా..ఆయన స్వీకరించి తనకు ప్రాన్స్ పలావ్ ఇష్టమని చెబుతూ ఎలా తయారు చేయాలో వివరించారు.


ప్రభాస్‌కి ఇష్టమైన ప్రాన్స్ పలావ్ తయారీ విధానం చెప్పి.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్’ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఫార్వార్డ్ చేశారు. ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరించి.. తనకి ఇష్టమైన వంటకాన్ని రామ్ చరణ్ చెప్పాల్సి ఉండగా.. ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చరణ్ తనకి ఏది ఇష్టం అని చెబుతాడో.. అని వేచి చూస్తున్న వారందరికీ కోరిక తీర్చేశాడు. తన ఫేవరేట్ డిష్ చేపల పులుసు అని చెబుతూ, అదెలా తయారు చేయాలో వివరించారు. అంతేకాదు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు తన బెస్ట్ విశెస్ తెలిపారు రామ్ చరణ్ (Ram Charan). అనంతరం ఈ ఛాలెంజ్‌ను చరణ్ తన ఫ్రెండ్ రానా దగ్గుబాటికి ఈ ఛాలెంజ్‌ని విసిరారు.

Ram-Charan.jpg

న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. సెప్టెంబర్ 7న ఈ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Raghava Lawrence: ఆ స్వామి అనుగ్రహంతోనే ఈ అదృష్టం

*************************************

*Narayana and Co: ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్..

*************************************

*Ala Ninnu Cheri: నిన్నటి కంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా.. క్రిష్ వదిలిన ప్రేమ సాంగ్

*************************************

*Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్

*************************************

*Skanda: ‘స్కంద’ వినాయక చవితికి రావట్లేదు.. ఎప్పుడో తెలుసా?

**************************************

Updated Date - 2023-09-07T01:30:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!