సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ram Charan: తన కో-స్టార్ ఈవెంట్‌‌లో సతీమణి ఉపాసనతో సందడి చేసిన గ్లోబల్ స్టార్

ABN, First Publish Date - 2023-03-11T18:38:01+05:30

ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards) ఈవెంట్‌లో పాల్గొనేందుకు రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తన ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్న విషయం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప‌లు ఈవెంట్స్‌లోనూ

Ram Charan at Paramount Pictures Studio Event
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards) ఈవెంట్‌లో పాల్గొనేందుకు రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తన ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్న విషయం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప‌లు ఈవెంట్స్‌లోనూ ఆయన ప్ర‌త్యేకంగా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలలో భాగంగా లాస్ ఏంజిల్స్‌లోని పార‌మౌంట్ పిక్చ‌ర్స్ స్టూడియోస్‌లో ప్రియాంక‌ చోప్రా (మ‌లాల యూస‌ఫ్ జైతో క‌లిసి) హోస్ట్ చేసిన ప్ర‌త్యేక‌మైన కార్యక్ర‌మంలో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ పాల్గొన్నారు. దక్షిణాసియాకి చెందిన చిత్రాలు ఆస్కార్‌కి నామినేట్ అయిన సందర్భంగా ఈ పార్టీ ఇచ్చింది పారామౌంట్ సంస్థ (Paramount Pictures Studio). ఈ కార్య‌క్ర‌మంలో ద‌క్షిణాసియాకు చెందిన నటులు, నిపుణులు, ఆస్కార్ నామినీస్‌, ఇతర సెలెబ్రిటీలు పాల్గొన్నారు.

తన కో-స్టార్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan) తో పాటు ఆయన స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల‌ (Upasana Konidela) కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్రియాంకకు ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేశారు. ‘‘మాకు అండగా నిలిచేందుకు వచ్చిన ప్రియాంకకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

తన భర్త రామ్ చరణ్, ప్రియాంక చోప్రా (Priyanka Chopra Jonas)తో కలిసి ఉన్న ఫొటోల‌ను ఆమె షేర్ చేసుకున్నారు. వ‌రుస ఇంట‌ర్వ్యూస్‌తో బిజీగా ఉన్నప్ప‌టికీ రామ్ చ‌ర‌ణ్ ఈ పార్టీకి స‌మ‌యాన్ని కేటాయించి సతీమణితో సహా హాజరవడం విశేషం.

ఈ పార్టీలో అంజుల ఆచార్య‌, మిండి కలింగ్‌, కుమైల్ నంజైని, క‌ల్ పెన్‌, అజీజ్ అన్సారీ, బెలా బ‌జ్రియా, రాధికా జోన్స్‌, జోసెఫ్ ప‌టేల్‌, శ్రుతీ గంగూలీ, అనితా ఛ‌ట‌ర్జీ వంటి ప్రముఖులెందరో పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన బాలీవుడ్ ఫిల్మ్ ‘జంజీర్’ (zanjeer) చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమయం వచ్చినప్పుడల్లా రామ్ చరణ్ మంచి నటుడు, స్నేహితుడు అంటూ ప్రియాంక చోప్రా చెబుతూ ఉంటుంది. ఇప్పుడీ పార్టీలో వారి ఫొటోలను చూస్తుంటే.. వారి స్నేహం ఎంత స్ట్రాంగ్ అనేది తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

Updated Date - 2023-03-11T18:47:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!