సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mega Festival: మెగాభిమానులారా.. టైమ్ గుర్తు పెట్టుకోండి.. మంగళవారం 6 గంటల 30 నిమిషాలకు..

ABN, First Publish Date - 2023-06-19T21:41:32+05:30

రామ్ చరణ్, ఉపాసన దంపతులు సోమవారం సాయంత్రం అపోలో హాస్పిటల్‌కి చేరుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఉపాసనకు డాక్టర్లు డెలివరీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీలో ఇప్పటికే సెలబ్రేషన్స్ వాతావరణం కనిపిస్తోంది. మెగాస్టార్ ఇంట్లోకి మరో స్టార్ అడుగుపెట్టబోతున్నారంటూ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు.

Ram Charan and Upasana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా ఫ్యామిలీ (Mega Family), మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న సమయం వచ్చేసింది. కొణిదెల ఇంట మూడో తరం రాకకు శుభముహుర్తం ఫిక్సయింది. మెగా ఫ్యాన్స్ సంబరాలు జరుపుకునే సమయం ఆసన్నమైంది. మెగా కుటుంబంలో బుడి బుడి అడుగులకు అపోలో హాస్పిటల్ (Apollo Hospitals) వేదిక కాబోతోంది. పెళ్లయిన పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చే శుభముహూర్తానికి టైమ్ కూడా సెట్టయింది. మంగళవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు.. గుర్తు పెట్టుకోండి. 6 గంటల 30 నిమిషాలకు మెగాస్టార్ ఇంట్లోకి వచ్చే మరో స్టార్ భూమి మీద ప్రత్యక్షం కాబోతోంది.

అవును.. మంగళవారం ఉదయం అదే టైమ్‌కి అపోలో హాస్పిటల్‌లో ఉపాసనకు డాక్టర్లు డెలివరీ చేయబోతున్నారు. ఇప్పటికే అపోలో హాస్పిటల్‌కి రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు కుటుంబ సభ్యులు కొందరు చేరుకున్నారు. వారు హాస్పిటల్‌కి చేరుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉపాసన హెల్దీగా కనిపిస్తున్నారు. రామ్ చరణ్.. ఉపాసన వెంటే ఉన్నారు. డెలీవరీ అయ్యేంత వరకు ఆయన ఉపాసన వెంటే ఉండనున్నారని తెలుస్తోంది.

ఈ సమయంలో ఉపాసన వెంట తను ఉండటం ధైర్యంగా ఉంటుందని భావించిన చరణ్.. షూటింగ్స్ అన్నింటికి బ్రేక్ చెప్పేశారు. దాదాపు ఆగస్ట్‌ వరకు చెర్రీ షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చినట్లుగా సమాచారం. అలాగే చరణ్‌, ఉపాసన దంపతులు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి వచ్చేసినట్లుగా రీసెంట్‌గా ఉపాసన ఓ వీడియోలో పేర్కొంది. మొత్తంగా అయితే మెగా ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడానికి ఇంకెంతో సమయం లేదని మాత్రం క్లారిటీ వచ్చేసింది. మెగాభిమానులందరూ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పుట్టబోయే బిడ్డ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షలు రవణం స్వామినాయుడు పిలుపిచ్చారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Bhagavanth Kesari: చిలకపచ్చ కోక.. కాజల్, శ్రీలీల చింపి ఆరేశారు


**************************************

*Kajal Aggarwal: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి బర్త్‌డే ట్రీట్..

**************************************

*Adipurush Collections: ఆ రెండూ ఊహించినవే కానీ.. ఈ ఏరియాలో మాత్రం ప్రభాస్‌కి కోలుకోలేని దెబ్బే!

**************************************

*Sitara: చిచ్చర పిడుగులా చెలరేగిపోతోన్న మహేష్ తనయ.. సాయిపల్లవిని దించేసింది

**************************************

Updated Date - 2023-06-19T21:41:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!