కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajini and Chiru: అక్కడ రజనీకాంత్.. ఇక్కడ చిరంజీవి.. ఇలా తగులుకున్నారేంటయ్యా..

ABN, First Publish Date - 2023-08-08T23:34:19+05:30

ఆగస్ట్ 10న సూపర్ స్టార్ రజనీకాంత్, ఆగస్ట్ 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ మేకర్స్ ఓ రేంజ్‌లో చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా రజనీ, చిరు చేసిన వ్యాఖ్యలు ఏపీ నాయకులకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.

Rajinikanth and Chiranjeevi

ఆగస్ట్ 10న సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), ఆగస్ట్ 11న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన చిత్రాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ మేకర్స్ ఓ రేంజ్‌లో చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఈవెంట్స్‌లో రజనీకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, అలాగే చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ని పెంచేశాయి. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా వ్యాఖ్యలు చేశారనేలా.. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కామెంట్స్ చేస్తున్నారు.


రజనీకాంత్ ‘జైలర్’ (Jailer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా?’’ అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్, ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ఫ్యాన్స్ హర్టవుతూ.. రజనీకాంత్‌ని ట్రోల్ చేస్తున్నారు. తమిళనాడు పరంగా చూస్తే.. అక్కడ హీరోయిజంలో విజయ్‌ని బీట్ చేసే వారే లేరనేలా.. రజనీకాంత్‌ని అవమానిస్తూ.. కొందరు కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. వాటికి, అలాగే ఈ మధ్య రజనీకాంత్ ఏపీ వచ్చి వెళ్లిన తర్వాత.. వైసీపీ వాళ్లు మాట్లాడిన మాటలకు కలిపి.. ఒకే ఒక్క స్టేజ్‌పై సమాధానం ఇచ్చేశాడనేలా.. సూపర్ స్టార్‌ని ట్రోల్ చేస్తున్న వాళ్లకి ఆయన ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు.

మరో వైపు చిరంజీవి (Chiranjeevi) మాట్లాడిన మాటలు.. వైసీపీ నాయకులకు తూటాల్లా గుచ్చుకుంటున్నాయి. చిరంజీవి మాటలకి ఒక్కొక్కరికి ఫీజ్‌లు ఎగిరిపోయాయ్.. అందుకే మైకుల ముందుకు వచ్చి.. గిల్లారు, గిచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి ఏం మాట్లాడారో కూడా తెలుసుకోకుండా.. వారు మీడియా ముందు చేస్తున్న కామెంట్లకి ప్రజలు కూడా సీరియస్ అవుతుండటం విశేషం. ‘మీరు మంచి చేస్తే.. తలలు వంచి నమస్కరిస్తారు.. దానిపై దృష్టి పెట్టండి.. పిచ్చుక లాంటి సినిమా ఇండస్ట్రీపై బ్రహ్మాస్త్రం ప్రదర్శించవద్దు’ అంటూ చిరు.. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో ఇండస్ట్రీ తరపున మాట్లాడారు. ఇంకేముంది.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కి సపోర్ట్ ఇస్తున్నాడనేలా ఆలోచిస్తూ.. చిరంజీవిపై వైసీపీ నాయకులు, ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా దానికి సరిపడా.. కౌంటర్స్ ఇస్తున్నారు. మొత్తంగా అటు రజనీ, ఇటు చిరు ఫ్యాన్స్.. టార్గెట్ ఒక్కటే అన్నట్లుగా సోషల్ మీడియాలో వాతావరణం మారిపోయింది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Malavika Mohanan: పచ్చరంగు స్విమ్‌ సూట్‌లో..

***************************************

*Pavan Sadhineni: ‘దయా’ సీజన్ 2 మాములుగా ఉండదు..

***************************************

*Guntur Kaaram: మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. రివీలయ్యేది ఎప్పుడంటే?

***************************************

*Meher Ramesh: ఇంకా డ్రీమ్‌లోనే వున్నా.. నేను డైరెక్టర్ అయ్యింది ఈ సినిమా చేయడానికేనేమో!

***************************************

*Bholaa Shankar: చిరు తీనుమారు స్టెప్పులు.. థియేటర్లలో ఇక దుమ్ములేపుడే..

***************************************

Updated Date - 2023-08-08T23:34:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!