TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. దానికి సమాధానమిదే!
ABN, First Publish Date - 2023-07-01T16:37:32+05:30
ఇంతకు తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో ప్రశ్న ఇచ్చినట్లే.. తాజాగా జరిగిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్షలో కూడా ‘బలగం’ సినిమాపై ఓ ప్రశ్నకు చోటిచ్చారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ‘బలగం’ మూవీకి ఇలాంటి ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై వచ్చిన ప్రశ్న.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్ష (TSPSC Group 4 Exam) శనివారం భారీ భద్రత నడుమ కట్టుదిట్టంగా నిర్వహించారు. దాదాపు 9.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరైనట్లుగా తెలుస్తోంది. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మినహా అంతా ప్రశాంతంగానే పేపర్ 1 పరీక్ష జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పరీక్షలో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘బలగం’ (Balagam) సినిమాపై ఓ ప్రశ్న ఇచ్చినట్లుగా.. సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోన్న ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఓ పేపర్ కట్ చూస్తుంటే తెలుస్తోంది.
సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోన్న ఆ ప్రశ్న ఏమిటంటే..
‘బలగం’ చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి?
A. దర్శకుడు : వేణు యెల్దండి
B. నిర్మాత : దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి
C. సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో
D. కొమరయ్య పాత్రను పోషించినారు : అరుసం మధుసుధన్..
సరైన సమాధానాన్ని ఎంచుకొనుము:
(1) A, B, C మరియు D
(2) A మరియు B మాత్రమే
(3) A, B మరియు D మాత్రమే
(4) A, B మరియు C మాత్రమే
ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4. ఎందుకంటే.. ‘బలగం’ సినిమాలో కొమరయ్య (Komarayya) పాత్రను పోషించిన నటుడి కేతిరి సుధాకర్ రెడ్డి (Kethiri Sudhakar Reddy). పైన D ఆప్షన్‌లో ఇచ్చిన అరుసం మధుసుధన్ (Arusam Madhusudhan) అనే నటుడు.. ఈ సినిమాలో కొమరయ్య చిన్న కొడుకుగా నటించారు. సంగీత దర్శకుడి (ఆప్షన్ C) విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండటంతో పాటు.. కొమరయ్య పాత్రధారి అసలు పేరు తెలియని వారు.. ఆప్షన్ 3 ని సమాధానంగా ఎన్నుకునే అవకాశం ఉంది. మరికొంత మంది ఆప్షన్ 1ని ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అందరూ ఈ సినిమాకు సంబంధించిన వారే అన్నట్లుగా ఆ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఆప్షన్ 4.
తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ‘బలగం’ మూవీకి ఇలాంటి ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. ఇంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా 2023 ఒనికో ఫిలిమ్స్ అవార్డులలో ‘బలగం’ సినిమా (Balagam Movie)కి ఏ విభాగంలో అవార్డ్ వచ్చిందనే ప్రశ్నని అడగడంతో.. కానిస్టేబుల్ పరీక్షలో ఇటువంటి ప్రశ్న అడుగుతారా? అంటూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)పై పలు రకాలుగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి:
**************************************
*D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం
**************************************
*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!
**************************************
*Maamannan: చివరి నిమిషంలో తొలగిన కోర్టు చిక్కులు.. టాక్ ఏంటంటే?
**************************************
*Bro Teaser Talk: మామ అల్లుళ్ళ మాస్ ర్యాగింగ్..
**************************************