Naga Vamsi: ‘ఓ మై బేబీ’ పాట ట్రోలింగ్‌పై మంకీలతో పోల్చుతూ.. మళ్లీ వివరణ
ABN, First Publish Date - 2023-12-15T15:01:45+05:30
‘గుంటూరు కారం’ సినిమా నుండి తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘ఓ మై బేబీ’పై సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్‌పై స్పందించిన గీత రచయిత రామజోగయ్య శాస్త్రిని ఫ్యాన్స్ బాగా హర్ట్ చేయడంతో.. ఆయన సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశారు. దీంతో బాగా హర్టయిన నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌పై సీరియస్ అయ్యారు.
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా నుండి తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘ఓ మై బేబీ’ (Oh My Baby)పై సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్‌పై స్పందించిన గీత రచయిత రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastri)ని ఫ్యాన్స్ బాగా హర్ట్ చేయడంతో.. ఆయన సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేశారు. మరోవైపు నిర్మాత నాగవంశీ (Naga Vamsi) కూడా ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా ‘యానిమల్’ సినిమాలో మంకీ స్టోరీ వీడియోని షేర్ చేసి.. ‘మేం ఏం చేస్తున్నామో మాకు తెలుసు.. జనవరి 12వ తేదీన చూసుకుందాం’ అని కౌంటర్ వేశారు. దీనికి ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ‘నువ్వు అసలు నిర్మాతవేనా.. అంటూ’ బూతులు మొదలెట్టారు.
‘‘ఆ తర్వాత కొంచెం సేపటికే.. తన ట్వీట్‌కు వివరణ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. ‘‘ఒక నిర్మాతగా నా సమాధానం మిమ్మల్ని హర్ట్ చేసి ఉండవచ్చు. కానీ మా టీమ్‌లోని వారు వారి పనులతో బిజీగా ఉంటే.. వారిపై మీరు చేసే ట్రోలింగ్, అసభ్యకర మాటలు ఎంత బాధించి ఉంటాయో అర్థం చేసుకోండి. ఎటువంటి అసభ్యకరమైన పదాలు వాడకుండా, ఎవరినీ టార్గెట్ చేయకుండా.. అనవసరమైన కఠిన పదాలు వాడకుండా ఇచ్చే అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం. మర్యాదపూర్వకంగానూ మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఇప్పటి వరకు చూడని మాస్ అవతార్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుగారిని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేద్దాం..’’ అని నాగ వంశీ మరో ట్వీట్లో పేర్కొన్నారు. (Naga Vamsi Tweet)
దీనికి కూడా నెటిజన్లు కొందరు నిర్మాత నాగవంశీపై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇచ్చిన సాంగే బాలేదు అంటే.. మళ్లీ నీ యాటిట్యూడ్ ఏంటిరా బాబూ’, ‘కొంతమంది ట్రిగ్గర్ అవుతారు కానీ.. మీరు ఆ స్టేజ్‌లో ఉండి అలా ఫ్యాన్స్‌ని అనడం ఏం బాలేదు’.. అని కొందరు నెటిజన్లు అంటుంటే.. మరికొందరు మాత్రం నాగవంశీకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘మీకు వంద కారణాలు ఉండవచ్చు.. కానీ దానిని తెలియజేసే విధానం మర్యాదపూర్వకంగా ఉండాలి. అంతేకానీ.. ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయకూడదు. ఈ విషయంలో నాగవంశీగారికే మా సపోర్ట్’, ‘నువ్వు తగ్గొద్దు అన్నా’ అంటూ నాగవంశీకి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!
***********************************
*Bunny Vas: జనసేన పార్టీలో నిర్మాత బన్నీ వాస్కు కీలక బాధ్యత
**************************************
*Gudumba Shankar: జనసేన పార్టీకి ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ఆదాయం
************************************