కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prabhas: ప్రభాస్ పెళ్లి గురించి శుభవార్త చెప్పిన పెద్దమ్మ!

ABN, First Publish Date - 2023-10-18T14:05:31+05:30

ప్రభాస్ అభిమానులందరికీ శుభవార్త. ఈ అక్టోబర్ 23న 44వ సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ప్రభాస్ త్వరలోనే పెళ్ళికొడుకు కాబోతున్నాడు అని అతని పెద్దమ్మ శ్యామలాదేవి ఒక శుభవార్త వినిపించారు.

Actor Prabhas

రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇప్పుడు ఒక్క తెలుగులోనే కాకుండా, అతని సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతూ బాక్స్ ఆఫిస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ రాబడుతూ ఉంటాయి. వచ్చే డిసెంబర్ 22న అతని సినిమా 'సలార్' #Salaar అన్ని భాషల్లోని విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా ప్రీ బుకింగ్స్ కూడా అప్పుడే ఓపెన్ అయి, అవి కూడా రికార్డు స్థాయిలో వున్నాయంటే ప్రభాస్ స్టామినా అంచనా వేయొచ్చు. అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ పెద్ద టాపిక్ గానే ఉంటుంది. ఎందుకంటే అతను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, ఆ విషయం అతన్ని అడిగితే దాటవేస్తూ ఉంటాడు. (Prabhas is going to tie the knot soon)

ఈ అక్టోబర్ 23కి 44 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు. అతని అభిమానులు కూడా ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని ఆతృతగా ఎదురు చూస్తూ వుంటారు. అలాగే ప్రభాస్ కి చాలామంది నటీమణులతో బంధంలో వున్నాడు అని వార్తలు కూడా వస్తూ ఉంటాయి. #PrabhasMarriage

ఇటువంటి నేపథ్యంలో ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృషంరాజు (KrishnamRaju) భార్య అయిన శ్యామలాదేవి (ShyamalaDevi) ప్రభాస్ పెళ్లి గురించి ఒక శుభవార్త చెప్పారు. ఆమె కనకదుర్గమ్మని దర్శించుకొని, బయటకి వచ్చి అక్కడ వున్న కొంత మంది మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరగబోతోంది అని చెప్పారు. "అమ్మాయి ఎవరో చెప్పలేను, తేదీ కూడా చెప్పలేను కానీ ప్రభాస్ వివాహం మాత్రం తొందరలోనే అవుతుంది," అని చెప్పారు శ్యామలాదేవి. పెదనాన్న కృష్ణంరాజు కుటుంబంతో ప్రభాస్ కి చాలా సన్నిహిత సంబంధం వుంది.

పెదనాన్నని తన సొంత నాన్నలో చూసుకుంటూ కృష్ణంరాజు వారసుడిగానే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రభాస్ కి కృష్ణంరాజు కి అప్పట్లో రెబెల్ స్టార్ అనేవాడు, ఇప్పుడు ఆ టాగ్ ప్రభాస్ కి ఇచ్చారు. అందుకే ప్రభాస్ ని రెబెల్ స్టార్ అని అభిమానులు పిలుచుకుంటూ వుంటారు.

Updated Date - 2023-10-18T14:05:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!