Prabhas Fans: సినిమా బాలేదన్నందుకు ఒకర్ని.. హనుమ కుర్చీలో కూర్చున్నందుకు మరొకర్ని.. చితకబాదారు
ABN, First Publish Date - 2023-06-16T15:37:32+05:30
‘ఆదిపురుష్’ సినిమాపై నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్న ఓ ప్రేక్షకుడిని, అలాగే థియేటర్లో హనుమంతుడి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నందుకు మరొకరిపై ప్రభాస్ ఫ్యాన్స్ చేయి చేసుకున్నారు. ఈ రెండు సంఘటనలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎంతగా ధ్యాస పెట్టారో అర్థమవుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది.
‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా బాగాలేదు అన్నందుకు ఒకరిని.. హనుమంతుడి (Lord Hanuma) కోసం ఉంచిన కుర్చీలో కూర్చున్నందుకు మరొకరిని ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) చితకబాదారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బాగాలేదని కొందరంటుంటే.. సినిమా అద్భుతం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎప్పటిలానే సినిమా పూర్తయిన తర్వాత ‘ఆదిపురుష్’పై ఆడియెన్స్ స్పందన (Audience Response) తెలుసుకోవడానికి ఐమ్యాక్స్ దగ్గర మీడియా వారు మైకులు పట్టుకుని నిలబడ్డారు. ఆ మైకుల ముందుకు వచ్చి.. సినిమా బాగాలేదని చెబుతున్న ఓ ప్రేక్షకుడిని పక్కనే ఉన్న ఫ్యాన్స్ చితకబాదారు. సినిమాపై ఆ వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా చెబుతుండటం గమనించిన ఫ్యాన్స్.. ముందు అతనితో గొడవకి దిగారు.. ఆ తర్వాత కొట్టుకునే వరకు వ్యవహారం వెళ్లింది. అయితే ఆ మైకుల ముందే ఆ తర్వాత చాలా మంది ఆడియెన్స్ సినిమా బాగాలేదంటూ.. చెప్పడం విశేషం.
మరో సంఘటనలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆడియన్‌పై చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో హనుమంతుడి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో ఓ ప్రేక్షకుడు కూర్చోవడంతో అభిమానులు అతనిపై దాడి చేసినట్లుగా సమాచారం. భగవాన్ హనుమాన్‌కు కేటాయించిన కుర్చీలో ఎలా కూచుంటావ్ అని ప్రశ్నిస్తూ.. అతనిని పక్కకు నెట్టివేశారట. హనుమంతుడి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించిన వ్యక్తి.. మద్యం తాగి ఉన్నట్లుగా గమనించిన ఫ్యాన్స్.. ఆ తర్వాత అతనిని వదిలేశారని తెలుస్తోంది. మొత్తంగా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా వేచి చూశారనేది.. ఇలాంటి సంఘటనలతో తెలిసిపోతుంది.
ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. టీజర్ విడుదలైనప్పుడు దర్శకుడు ఓం రౌత్ (Om Raut)పై ఎలాంటి విమర్శలు అయితే వచ్చాయో.. ఇప్పుడు పూర్తి రామాయణ (Ramayan) కథనే మార్చేశాడంటూ సినిమా చూసిన వారు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొందరు ఈ సినిమాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ సినిమాపై విమర్శలు మాత్రం ఓ రేంజ్‌లో మొదలయ్యాయి. ఈ సినిమాని ‘రామాయణం’ అని ప్రమోట్ చేసి.. పిల్లలని పెడదోవ పట్టించవద్దంటూ.. చిత్రయూనిట్‌కి సోషల్ మీడియా వేదికగా సందేశాలు మొదలయ్యాయంటే ఓం రౌత్ (Director Om Raut) ఎలా ఈ సినిమాని తెరకెక్కించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Lord Hanuma: ‘ఆదిపురుష్’ థియేటర్‌లోకి వానరం.. హనుమంతుడే అంటూ ఆడియన్స్ జైశ్రీరామ్ నినాదాలు.. వీడియో వైరల్
**************************************
*Adipurush: ‘ఆదిపురుష్’ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
**************************************
*King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను
**************************************
*Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..
**************************************
*Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!
**************************************