Adipurush: ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ABN, First Publish Date - 2023-06-17T17:59:04+05:30
గ్లోబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన తారాగణంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు సునామీనే సృష్టించేసింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 140 కోట్లను రాబట్టి రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ కలెక్షన్లతో మేకర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ప్రధాన తారాగణంగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ (Om Raut) తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు సునామీనే సృష్టించేసింది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లతోనే బాక్సాఫీస్ వద్ద భారీ తుఫానుని క్రియేట్ చేసిన ఈ సినిమా.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ₹140 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ డే రెస్పాన్స్‌ని అందుకుంది. బిజినెస్ పరంగా కూడా ఆదిపురుష్ మొదటి రోజు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాప్ 5లో నిలిచిన ఏకైక హిందీ చిత్రంగా రికార్డ్ సృష్టించిందీ సినిమా. ఈ విషయం తెలియజేస్తూ మేకర్స్ అధికారికంగా ‘ఆదిపురుష్’ లెక్కలతో ఓ పోస్టర్ వదిలారు. అందులో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 140 కోట్లు రాబట్టినట్లుగా ప్రకటించారు. (Adipurush Day 1 Collections)
ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రచారం, ఈ సినిమా ఇతివృత్తం, ప్రభాస్ నటించిన సినిమా వచ్చి చాలా కాలం అవడం, ప్రమోషన్స్.. ఇలా అన్నీ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలకు తగ్గట్టే డే 1 బుకింగ్ జరిగింది. విడుదల తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం ప్రభాస్ సరికొత్త రికార్డ్‌ను కొట్టేశాడు. ఈ వీకెండ్ వరకు ఈ కలెక్షన్ల సునామీ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే పిల్లలకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ని ఇచ్చే కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా వారు చెబుతున్నారు.
డే2 విషయానికి వస్తే.. సినిమాకు వస్తున్న టాక్‌తో సంబంధం లేకుండా రెండో రోజు కూడా చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. డే1 పరంగా కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ఈ చిత్రం రూ. 51 కోట్లకు పైగా రాబట్టినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు డే 1 రికార్డ్ ‘పఠాన్’ (Pathaan) పేరు మీద ఉండగా.. ఇప్పుడు ‘ఆదిపురుష్’.. ఆ సినిమాను బీట్ చేసి ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్, మేకర్స్ ఈ రికార్డ్ కలెక్షన్లతో హ్యాపీగా ఉన్నారు. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధునీకరించిన ఈ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని T-సిరీస్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రో ఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్, UV క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
**************************************
*Prabhas Fans: సినిమా బాలేదన్నందుకు ఒకర్ని.. హనుమ కుర్చీలో కూర్చున్నందుకు మరొకర్ని.. చితకబాదారు
**************************************
*Lord Hanuma: ‘ఆదిపురుష్’ థియేటర్‌లోకి వానరం.. హనుమంతుడే అంటూ ఆడియన్స్ జైశ్రీరామ్ నినాదాలు.. వీడియో వైరల్
**************************************
*Adipurush: ‘ఆదిపురుష్’ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
**************************************
*King Nagarjuna: నిజంగా భయపడ్డాను.. అందుకే నవ్వాను
**************************************
*Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా మారుతోన్న బాలీవుడ్ రొమాంటిక్ హీరో..
**************************************
*Anasuya: మొన్న బీచ్‌లో.. ఈసారి మామిడి తోటలో.. అనసూయ ఇలా అయితే కష్టం!
**************************************