కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: ఈ రోజుల్లో ఎవడున్నాడ్రా.. ఇలాంటోడు!

ABN, First Publish Date - 2023-09-02T16:28:01+05:30

కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు.. ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్రను ఉద్దేశించి బ్రహ్మానందం చెప్పే డైలాగ్‌ ఇది. తెరపై భారీ డైలాగ్‌లు చెప్పకపోయినా.. కొడితే బిల్డింగ్‌లు దాటుకుని విలన్‌ పడకపోయినా, పెద్దగా డాన్స్‌లు చేయకపోయినా తెరపై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. అలాంటి పవర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

Pawan Kalyan

కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు.. ‘గబ్బర్‌సింగ్‌’ (Gabbar Singh) సినిమాలో పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పాత్రను ఉద్దేశించి బ్రహ్మానందం చెప్పే డైలాగ్‌ ఇది. తెరపై భారీ డైలాగ్‌లు చెప్పకపోయినా.. కొడితే బిల్డింగ్‌లు దాటుకుని విలన్‌ పడకపోయినా, పెద్దగా డాన్స్‌లు చేయకపోయినా తెరపై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. ఇక ఫ్యాన్స్‌ హడావిడికైతే హద్దే ఉండదు. పవన్‌కు భక్తులు ఉంటారని దర్శకుడు హరీష్‌ శంకర్‌ (Harish Shankar) తరచూ చెబుతుంటారు. ఈశ్వరా.. పవనేశ్వరా.. దేవరా అని బండ్ల గణేష్‌ (Bandla Ganesh) పిలుస్తాడు. ఆయన దర్శనమైతే చాలనుకుంటారు అభిమానులు. పవన్‌కు ఉన్నది ఫ్యాన్స్‌ కాదు భక్తులు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది.

వెనక మెగాస్టార్‌ (MegaStar)లాంటి మూలస్తంభం ఉన్నప్పటికీ సాధారణ జీవితాన్నే కొనసాగించాలనుకున్న ఓ కుర్రాడు సినీ రంగంలో అడుగుపెట్టి దినదినాభివృద్ధి చెందుతూ తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆయనలోని విలక్షణ వ్యక్తిత్వం.. నాయకుడిని చేసి.. అభిమానుల గుండెల్లో గుడి కట్టుకునేలా చేసింది. జయాపజయాలకు అతీతంగా ఆయనకు ఫ్యాన్‌ బేస్‌ ఉంది. సినిమా ఫ్లాప్‌ అయినా ఆయన క్రేజ్‌, మార్కెట్‌ ఏ మాత్రం తగ్గలేదు. పవన్‌ కోరుకుని సమయం కేటాయిస్తే.. కోట్లు వస్తాయి కానీ అవన్నీ వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే దృఢమైన సంకల్పంతో జనసేనానిగా తిరుగుతున్నాడు. సామాన్యుల కష్టాలను తెలుసుకుంటున్నాడు. ప్రజల కష్టాలు తీర్చడానికి కోట్లు కూడా ఇవ్వగలడు.. కొట్లాటకైనా దిగ గల సత్తా ఉన్న నాయకుడు పవన్‌. తన రాష్ట్రానికి, దేశానికి ఏదో చేయాలనే తపనతో తిరుగుతున్నాడు. ఆ తపన రోజురోజుకీ పెరుగుతుందే తప్ప ఇంచు కూడా తగ్గడం లేదు. (Pawan Kalyan Birthday Special)


మంచితనం, మానవత్వం, దేశభక్తిని మించిన హీరోయిజం లేదనేలా.. హీరోయిజం అర్థాన్నే మార్చేశాడు. పవన్‌ గొప్ప నటుడు కాదు.. అతని డాన్స్‌లు కూడా అంత గొప్పగా ఉండవు. ఆ విషయాన్ని సూటిగా చెప్పగల సింప్లిసిటీ ఆయనది. పవన్‌తో సినిమా చేయడానికి నిర్మాతలు క్యూ కడతారు. నెంబర్స్‌తో కొలవలేని స్టార్‌డమ్‌ ఆయనది. పవన్‌ అడుగువేస్తే పెద్ద సైన్యమే వెనుక నడుస్తుంది. పోటీ చేసిన చోట ఓడిపోయి ఉండొచ్చు.. ఆ ఓటమినే గెలుపునకు నాందిగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అవినీతి రహిత సమాజం కోసం ఆయన చేస్తున్న పోరాటంలో ఓటమిని తట్టుకుంటాడా? లేదా ధైర్యంగా నిలబడతాడా? అన్నది చూడడానికే ఓటమి ఎదురైంది. తట్టుకుని నిలబడి పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. ఇక గెలుపు అంటారా? పవన్‌కల్యాణ్‌ ఓడిన రోజే గెలిచాడు. ఏ అధికారం లేకపోయినా కష్టం అంటూ తన తలుపు తట్టిన వారికి అండగా ఉంటున్నాడు. ప్రభుత్వం బాధ్యతారహితంగా పేదలను పట్టించుకోకపోయినా ‘నేనున్నాను’ అంటూ సహకరిస్తున్న అసలైన లీడర్‌ పవన్‌ కల్యాణ్‌.


అతని నిజాయితీని ఏమి అనలేక..

ప్రస్తుత ఏపీ ప్రభుత్వం, అందులోని నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వాన్ని అతని నిజాయతీని ఏమి అనలేని పరిస్థితిలో వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్‌ చేసి దూషిస్తున్న సంగతి తెలిసిందే! ఎందుకంటే పవన్‌కల్యాణ్‌ అవినీతి చేసి సంపాదన, అక్రమార్జన లేదు. నేర చరిత్ర లేదు. కాబట్టి పవన్‌ను టార్గెట్‌ చేయడానికి ఏ కారణం లేక తన పెళ్లిళ్లు, భార్యల ప్రస్తావన తీసుకొస్తున్నారని తరచూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు, జనసైనికులు పోస్ట్‌లు పెడుతూనే ఉంటారు. అయితే అతన్ని కామెంట్‌ చేసే వాళ్లకు అభిమానులు, నెటిజన్లు హితవు పలుకుతూనే ఉంటారు. పవన్‌కల్యాణ్‌ మొదటి భార్య నందిని, వైజాగ్‌ వాసి, ఆమె లా చదివింది. పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లయిన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో చట్టరీత్యా విడాకులు తీసుకున్నారు. ఎవరి దార్లో వారు ప్రయాణిస్తున్నారు. నందిని బయటకు వచ్చి ఏరోజు పవన్‌ గురించి మాట్లాడలేదు. తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్‌ రేణూ దేశాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. రేణుతో కూడా విడాకులిచ్చారు. అయినప్పటికీ వారిద్దరూ స్నేహంగా ఉంటారు. తన బిడ్డలు అకీరా, ఆద్య తల్లితోపాటు పుణెలో ఉన్నా వారి బాధ్యతలను పవన్‌ కల్యాణే చూసుకుంటున్నారు. అక్కడ కూడా ఎలాంటి సమస్య లేదు. రేణూ దేశాయి కూడా పవన్‌ని ఎప్పుడూ ఏ మాట అనలేదు. ఆ బంధం ముగిశాక రష్యాకు చెందిన అన్నా లెజినోవాను మూడో పెళ్ళి చేసుకున్నారు. అయితే ఇవన్నీ చట్టబద్దంగానే జరిగాయి. పవన్‌తో వారికి సమస్య లేదు... వాళ్లతో పవన్‌కు సమస్య లేదు. అయితే ఏపీ ప్రభుత్వానికి మాత్రం రాష్ట్రంలో ఉన్న సమస్యల కన్నా పవన్‌కల్యాణ్‌ పెళ్లిల్లే సమస్యగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. లోకంలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు లేరా? మీకు పవన్‌కల్యాణ్‌ ఒక్కరే కనిపిస్తున్నారా? ప్రజాసేవలో ఉన్నవారు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లోకి రాకూడదనే కామన్‌సెన్స్‌ లేదా అని అభిమానులు పలు మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటారు. అయినా మారరు కదా. (HBDPawanKalyan)

ఎవరు ఎన్ని అనుకున్నా.. పవన్ కల్యాణ్ ధ్యేయం, మార్గం ఒక్కటే. సాధ్యమైనంత వరకు ప్రజలకు దగ్గరగా ఉండటం, వారి కష్టాలను దూరం చేయడం. సొంత అన్నదమ్ములే ఆస్తుల విషయంలో కొట్లాడుకుని చంపుకునే రోజులివి. అలాంటిది.. తన సొంత డబ్బుల్ని రైతులకు పంచుతూ.. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు క్రియేట్ చేయని చరిత్రను లిఖిస్తూ.. జనహితమే లక్ష్యంగా ముందుకు సాగిపోతున్న జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. (#HappyBirthdayPowerStar)


ఇవి కూడా చదవండి:

============================

*Bhagavanth Kesari: హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్‌లో బాలయ్య, శ్రీలీల.. అరుపులే!!

**************************************

*Miss Shetty Mr Polishetty: సెన్సార్ పూర్తి.. ఇక తెరపై చూసుకుందాం

*************************************

*Salaar: ‘సలార్’ వాయిదా పడనుందా? తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

*************************************

*Shiva Nirvana: క్లైమాక్స్ బాగుండి ఫెయిలైన సినిమా చరిత్రలో లేదు

**************************************

*Pawan Kalyan: సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో మూవీ.. ఆఫీస్ ప్రారంభమైంది

***********************************

*Tiger Nageswara Rao: వేటయింది.. ఇప్పుడు ఆట టైమ్!

***********************************

Updated Date - 2023-09-02T16:28:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!