23YrsOfBlockBusterBadri: పవన్ కల్యాణ్ ‘బద్రి’ గురించి ఈ విషయం తెలుసా?
ABN, First Publish Date - 2023-04-20T13:37:24+05:30
పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ (Prakash Raj)ల మధ్య వచ్చే సన్నివేశాలు.. ఇప్పటికీ మాస్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వినిపిస్తాయంటే.. పవన్ సినీ కెరీర్‌లో ‘బద్రి’ స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఓ విషయం..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు, మాస్ ప్రేక్షకులకి హీరోలని దగ్గర చేసే డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘బద్రి’ (Badri). ‘సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు’ వంటి వరుస విజయాలతో క్లాస్ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన పవన్ కల్యాణ్‌ని మాస్ ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు.. ఆయన పవర్‌ఫుల్ ఇమేజ్‌కి కారణమైన చిత్రం ‘బద్రి’ అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ (Prakash Raj)ల మధ్య వచ్చే సన్నివేశాలు.. ఇప్పటికీ మాస్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వినిపిస్తాయంటే.. పవన్ సినీ కెరీర్‌లో ‘బద్రి’ స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఓ విషయం హాట్ టాపిక్‌గా మారుమోగుతుందనే విషయం అందరికీ తెలియదు.
ఆ విషయం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ ఎంట్రీ నాటికే.. ఇండస్ట్రీలో హీరోయిజం డామినేషన్ ఎక్కువగా నడుస్తోంది. నిర్మాత, దర్శకుల డామినేషన్ నుంచి అప్పుడప్పుడే ఇండస్ట్రీ హీరోల చేతుల్లోకి వస్తోంది. హీరోలు ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉన్న సమయంలో.. ‘బద్రి’ టైటిల్ కార్డ్స్‌లో (Badri Title Cards) ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏ సినిమాకైనా ముందు హీరోగారి పేరు, ఆ తర్వాత టైటిల్ పడే క్రమాన్ని మార్చి.. ఫస్ట్ హీరోయిన్ల పేర్లు, ఆ తర్వాత కీలక పాత్రలో నటించిన ప్రకాశ్ రాజ్ పేరు పడిన అనంతరం టైటిల్ కార్డ్స్‌లో పవన్ కల్యాణ్ పేరును వేశారు. ఆ తర్వాత సినిమా టైటిల్ కార్డ్ పడుతుంది. నిజంగా ఇది అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు టాక్ చూసి.. పూరీ జగన్నాధ్‌కి నీరసం వచ్చేసింది. ఎందుకంటే ఈ సినిమా మొదటి రోజు ప్లాప్ అనే టాక్ వైరలైంది. కానీ ఆ మరుసటి రోజు నుంచి ఈ సినిమాని ఆపడం ఎవరితరం కాలేదు. ప్రతి ఒక్కరి నోటా ఒకటే డైలాగ్.. ‘నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాధ్ అయితే ఏంటి?’ (Nuvvu Nanda Ayite Nenu Badri Badrinath.. Ayite Enti?). అంతేకాదు, ఈ సినిమా తర్వాత కుర్రకారు డ్రస్ స్టయిలింగ్, యాటిట్యూడ్ కూడా మారిపోయింది. అంతగా ఈ సినిమా యూత్‌లోకి దూసుకెళ్లింది.
‘బద్రి’ సినిమా విడుదలై 23 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 23YrsOfBlockBusterBadri ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాతో తమకున్న అనుబంధాన్ని తెలిపిన సెలబ్రిటీల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిత్యామీనన్.. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ విషయంలో హీరోయిన్ల పేరుతో స్టార్ట్ చేయడాన్ని చాలా గొప్పగా చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ చార్ట్‌బస్టర్స్‌గా నిలుస్తుంటాయి. ముఖ్యంగా ‘బంగాళాఖాతంలో..’ సాంగ్ లేకుండా ఏ జాతర జరగదంటే అతిశయోక్తి కానే కాదు. అంతగా ఈ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కాగా.. విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై టి. త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అమీషా పటేల్ (Amisha Patel), రేణు దేశాయ్ (Renu Desai) హీరోయిన్లుగా నటించారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Sai Dharam Tej: ‘విరూపాక్ష’ను ‘కాంతార’తో పోల్చవద్దు
*Thalapathy Vijay: ఒకే ఒక్క సిట్టింగ్‌లో.. మరో టాలీవుడ్ దర్శకుడితో విజయ్ మూవీ!
*OG: అఫీషియల్.. పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరంటే..
*Tollywood: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ కార్యాలయాల్లో ఐటీ దాడులు
*Taapsee Pannu: సౌత్ సినీ ఇండస్ట్రీని ఇంత చీప్‌గా తీసేసిందేంటి?
*Trisha: కార్తీతో కెమిస్ట్రీపై.. త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు