Pawan Kalyan: గుండెకు గొంతొస్తే.. బాధకి భాషొస్తే.. నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్
ABN, First Publish Date - 2023-08-07T22:14:33+05:30
ప్రజా యుద్ధనౌక, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ అంత్యక్రియలు బౌద్ధ మత పద్ధతిలో జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు ముగిశాయి. గద్దర్‌ను అన్నగా భావించే పవన్ కళ్యాణ్.. మరోసారి సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. తాజాగా గద్దర్ గురించి తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఓ వీడియోను విడుదల చేశారు.
ప్రజా యుద్ధనౌక, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ అంత్యక్రియలు(Gaddar Funeral) బౌద్ధ మత పద్ధతి(Buddhist Religion)లో జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు ముగిశాయి. గద్దర్ ఆఖరి కోరిక మేరకు అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ గ్రౌండ్(Alwal Mahabodhi School)లో అంత్యక్రియలు జరిపారు కుటుంబ సభ్యులు. గద్దర్‌ను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. మరోసారి సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించారు. తాజాగా గద్దర్ గురించి తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో..
‘‘బీటలు బారిన ఎండలో.. సమ్మెట కొట్టే కూలీకి గొడుగు గద్దర్
తాండాల బండల్లో చలిపులిని బెదిరించే నెగుడు గద్దర్
పీడిత జనుల పాట గద్దర్..
అణగారిన ఆర్తుల ఆసరా గద్దర్
అడవిలో ఆకు చెప్పిన కథ గద్దర్
కోయిల పాడిన కావ్యం గద్దర్
గుండెకు గొంతొస్తే.. బాధకి భాషొస్తే.. అది గద్దర్
అన్నింటినీ మించి నా అన్న గద్దర్
అన్నా.. నువ్వు గాయపడ్డ పాటవి
కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవి
అన్యాయంపై తిరగబడ్డ పాటవి
ఇది వరకు నువ్వు ధ్వనించే పాటవి
ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి
తీరం చేరిన ప్రజా హితునికి.. జోహార్.. జోహార్.. జోహార్’’ అంటూ గద్దర్‌కు పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు.
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గద్దర్ పార్థివ దేహాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించిన నివాళులర్పించిన విషయమూ తెలిసిందే. సోమవారం జరిగిన గద్దర్ అంత్యక్రియలకు అభిమానులు, కవులు, కళకారులు భారీగా తరలివచ్చి నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి:
***************************************
*Upasana: ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఉపాసన సంచలన నిర్ణయం
***************************************
*Kushi: మహేష్ బాబు బర్త్‌డేకి విజయ్ దేవరకొండ ఇస్తోన్న ట్రీట్ ఇదే..
***************************************
*Jawan: మరోసారి లుంగీ డ్యాన్స్‌తో.. ఈసారి దుమ్ములేచిపోవడం ఖాయం
***************************************
*Samantha: రూ. 25 కోట్లా? నేనూ వర్క్ చేశా.. అందుకు రాళ్లూరప్పలేం ఇవ్వలేదు
***************************************