కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: ఇటలీకి పయనం అయిన పవన్ కళ్యాణ్ దంపతులు, ఫోటోస్ వైరల్

ABN, First Publish Date - 2023-10-28T11:11:36+05:30

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహానికి బాబాయి పవన్ కళ్యాణ్ కి వీలవుతుందా లేదా అని అనుకున్నారు కానీ, పవన్ కళ్యాణ్ అతని భార్యతో సహా ఈరోజు ఇటలీ బయలుదేరి వెళ్లారు. హైదరాబాదు విమానాశ్రయంలో వాళ్ళిద్దరి ఫోటోస్, వీడియోస్ సంఘీమాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan and his wife Anna

నటుడు, జనసేన (JanaSena) అధినేత పవన్ కళ్యాణ్ (PawanKalyan) తన రాజకీయ, సినిమా పనులను పక్కన పెట్టి ఇటలీ కి పయనం అయ్యారు. హైదరాబాదు విమారాశ్రయంలో పవన్ కళ్యాణ్, భార్య ఆనా ఇద్దరూ కలిసి విమానాశ్రయంలోకి నడుస్తున్న ఫోటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నాగబాబు (Nagababu) కుమారుడు వరుణ్ తేజ్ (VarunTej), నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) తో నావంబర్ 1 వతేదీన ఇటలీ లో వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా లేదా అని అనుకున్నారు కానీ, అతను తన పనులను పక్కన పెట్టి, ఈ వివాహానికి హాజరు అవుతూ వున్నారు.

నిన్న వరుణ్ తేజ్, లావణ్య, నిహారిక కొణిదెల (NiharikaKonidela) ఇటలీ పయనం అయ్యారు. ఈ వివాహానికి మెగా కుటుంబ (MegaFamily) సభ్యులు, అతికొద్దిమంది మిత్రులు హాజరు అవుతున్నారని తెలిసిందే. ఇటలీ లో వివాహం అయినా తరువాత, నవంబర్ 5వ తేదీన పరిశ్రమలోని అతిథిల కోసం ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. కొంతమంది మెగా కుటుంబ సభ్యులు అప్పుడే ఇటలీ చేరుకున్నారని, మిగతా వాళ్ళు కూడా ఈరోజు రేపటితో చేరుకుంటారని తెలిసింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. హైదరాబాదులోని నాగబాబు ఇంట్లో కొన్ని నెలల క్రితం నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు ఇటలీలో వివాహం జరగబోతోంది.

Updated Date - 2023-10-28T11:14:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!