కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NTRNEEL: ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..

ABN, First Publish Date - 2023-10-05T17:12:32+05:30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఒకటి కాదు రెండు పార్టులుగా తెరకెక్కబోతుందంటూ.. తాజాగా దర్శకుడు కొరటాల శివ వీడియో మెసేజ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు తారక్ ‘వార్ 2’ అనే బాలీవుడ్ ఫిల్మ్‌లో చేస్తున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రశాంత్ నీల్‌తో చేయాల్సిన సినిమా ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం అవుతుందని మేకర్స్ తెలిపారు.

Prashanth Neel and Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ (Devara) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఒకటి కాదు రెండు పార్టులుగా తెరకెక్కబోతుందంటూ.. తాజాగా దర్శకుడు కొరటాల శివ వీడియో మెసేజ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఇప్పటికే యంగ్ టైగర్ రెండు సినిమాలకు సైన్ చేసి ఉన్నారు. అందులో ఒకటి బాలీవుడ్ ఫిల్మ్ ‘వార్ 2’ (War 2) కాగా, రెండోది కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel)తో ఉండబోయే ఆటంబాంబ్ లాంటి చిత్రం.

కొరటాల శివ ఇచ్చిన ‘దేవర’ అప్‌డేట్‌కు ముందు ఎన్టీఆర్‌కు, ‘వార్ 2’ దర్శకుడికి మధ్య చర్చలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే ఆ సినిమా లైన్‌లోకి వచ్చేసినట్లే. ఇక అణుబాంబ్ చిత్రానికి సంబంధించి కూడా తాజాగా ఓ అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు. ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోతోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం, ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం కానుందని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. (NTRNEEL Film Update)


వాస్తవానికి తారక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నారు. అనౌన్స్‌మెంట్‌తోనే ట్రెండ్ బద్దలైన ప్రాజెక్ట్ ఇది. అదే రేంజ్‌లో అంచనాలు కూడా ఉన్నాయి. ఆ అంచనాలకు ధీటుగా మేక‌ర్స్ మూవీని నిర్మించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్ పూర్తి చేసే పనితో పాటు ఎన్టీఆర్‌తో చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. (NTR And Prashanth Neel Project)


ఇవి కూడా చదవండి:

============================

*Kiran Abbavaram: బిగ్‌ బాస్ రతికతో పెళ్లి అనగానే.. కిరణ్ అబ్బవరం రియాక్షన్ చూశారా..

*********************************

*Lethakulu: ఎస్తర్ కీలకపాత్రలో నటిస్తోన్న సినిమా టైటిల్ ఇదే..

******************************

*Yendira Ee Panchayithi: ‘ఏందిరా ఈ పంచాయితీ’కి సెన్సార్ ఏ సర్టిఫికేట్ జారీ చేసిందంటే..

******************************

*Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసు వ్యవహారంలో నా పేరు ఎందుకు హైలెట్ అయ్యిందంటే?

***********************************

*Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మాసివ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్

********************************

Updated Date - 2023-10-05T17:12:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!