సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Naga Chaitanya: నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను బాధపడలేదు

ABN, First Publish Date - 2023-05-02T16:29:40+05:30

ఎదురైన ప్రతి సంఘటన నుంచి చైతూ ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపారు.. కానీ

Akkineni Naga Chaitanya
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నా లైఫ్‌లో ఇప్పటివరకు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు..’ అని అన్నారు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya). ఆయన హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘కస్టడీ’ (Custody). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నాగచైతన్య (Naga Chaitanya) తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘‘నా లైఫ్‌లో ఇప్పటివరకు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు.. బాధపడలేదు. నాకు ఎదురైన ప్రతి సంఘటన నుంచి నేను ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉన్నాను. కానీ కొన్ని సినిమా కథల (Movie Stories) విషయంలో బాధపడ్డా. ఆ సినిమా కథపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయానే అని అనుకుంటూ ఉంటాను. అలాగే ఆ సినిమాలతో ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టానే.. అని మాత్రం బాధపడుతుంటాను. ముఖ్యంగా ఇది మూడు సినిమాల విషయంలో జరిగింది’’ అని నాగ చైతన్య (Naga Chaitanya) చెప్పుకొచ్చారు.

అయితే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా.. అంత ధైర్యంగా నిలబడటం చైతూకే సాధ్యం అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా నాగ చైతన్య లైఫ్‌లో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. ఒక్క విడాకులు అనే కాదు.. ఆయన చిన్నప్పటి నుంచి, ఎన్నో బాధలను దిగమింగుకుంటూ పెరిగారు. సమంత (Samantha)తో పెళ్లి తర్వాత హ్యాపీగా ఉంటారని అంతా అనుకుంటే.. అది మూడునాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఆమెతో విడాకుల తర్వాత కూడా చైతూ తన పని తాను చేసుకుంటూ.. ఎప్పుడూ ఆనందంగానే ఉన్నట్లుగా కనిపిస్తుంటారు. మనసులో ఎంత బాధ ఉన్నా.. ముఖంపై మాత్రం చిరునవ్వును చెరగనీయడు.. అతనికి ఓర్పు, సహనం ఎక్కువ. అందుకే ఎలాంటి విషయాన్ని అయినా పాఠంగానే భావిస్తున్నానని చెబుతున్నాడు.. అంటూ ఈ ఇంటర్వ్యూ తర్వాత చైతూ గురించి అభిమానులు మాట్లాడుకుంటుండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

************************************************

*Sarath Kumar: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 సినిమాలు

*Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్

*PS2: కలెక్షన్ల ఊచకోత మొదలైంది..

*Dil Raju: మేరా దిల్ ఖుష్ హువా..

*Nidhhi Agerwal: ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న నిధి.. సంచలన నిర్ణయం

*Anushka: ‘మిస్ శెట్టి’.. ప్రభాస్‌ని భలే బుక్ చేసిందిగా.. ఇక నలుగురిలో తిరగగలడా?

Updated Date - 2023-05-02T16:29:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!