కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Trisha - Nithin : మన్సూర్‌ అలీ వ్యాఖ్యలు..  నితిన్  ఆగ్రహం 

ABN, First Publish Date - 2023-11-20T16:43:15+05:30

హీరోయిన్  త్రిష (Trisha) విషయంలో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan) చేసిన హేయమైన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సినీ తారలు, దర్శకులు త్రిషకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే! త్రిష కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు.

హీరోయిన్  త్రిష (Trisha) విషయంలో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan) చేసిన హేయమైన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సినీ తారలు, దర్శకులు త్రిషకు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే! త్రిష కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. వీరిద్దరూ తాజాగా 'లియో’ చిత్రంలో నటించారు. మన్సూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లియో (Leo) చిత్రంలో త్రిషతో సన్నివేశాలు లేకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేశారు. త్రిషతో బెడ్‌ రూమ్‌లో సన్నివేశాన్ని ఆశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా త్రిష మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నీచమైన, అసహ్యకరమైన సదరు కామెంట్స్‌  స్త్రీలపై చులకన భావాన్ని కలగజేసేలా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. లియో సినిమాలోని మన్సూర్‌తో కలిసి నటించకపోవటంపై ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేసేదే లేదని చెప్పారు. మన్సూర్‌ వంటి వ్యక్తుల వల్ల మానవాళికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని త్రిష పేర్కొన్నారు. 

హీరో  నితిన్  (Hero Nithin) ఈ విషయంపై స్పందించారు. త్రిషపై నీచంగా, ఆమెను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌ ప్రవర్తనను నితిన్‌ ఖండించారు. ఈ సమాజంలో, సినీ ఇండస్ట్రీలో  పురుషాంకారానికి తావు లేదని నితిన్‌ తెలియజేశారు.  స్త్రీలపై ఇలాంటి ఇబ్బందికరమైన, ద్వేష పూరిత కామెంట్స్‌ చేేస వారికి వ్యతిరేకంగా సమాజం, సినీ ఇండస్ట్రీ ఉండాలని, మన పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఇలాంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిలబడాలని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, మాళవికా మోహనన్‌, సింగర్‌ చిన్మయి, మంజిమ మోహన్‌ సహ పలువురు నటీనటులు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. 


Updated Date - 2023-11-20T16:43:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!