Vijay Deverakonda Rashmika: మళ్ళీ ట్రోల్ అవుతున్న విజయ్, రష్మీక జంట
ABN, First Publish Date - 2023-11-13T13:32:57+05:30
విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక మందన్న దీపావళి పండగ జరుపుకుందని వాళ్లిద్దరూ సాంఘీక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఫోటోస్ చెపుతున్నాయని, నెటిజన్స్ వెళ్ళిద్దరినీ ట్రోల్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ (VijayDeverakonda), రష్మిక మందన్న (RashmikaMandanna) మీద ఇంతకు ముందు చాలా సార్లు నెటిజన్స్ ట్రోల్ చేశారు. వాళ్లిద్దరూ మలేషియా ట్రిప్ కలిసే వెళ్లారు అని, అప్పుడు ఇద్దరు కామన్ గా వాడే వస్తువులను పెట్టి, ఇద్దరూ కలిసే వెళ్లారు, కలిసే వస్తున్నారు, కలిసే వుంటున్నారు అని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ నిన్న దీపావళి పండగ సందర్భంగా ఈ జంటని మళ్ళీ నెటిజన్స్ ట్రోల్ చెయ్యడం మొదలెట్టారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ ఇద్దరూ పండగ సందర్భంగా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ సాంఘీక మాధ్యమంలో ఫోటోస్ పోస్ట్ చేశారు.
విజయ్ దేవరకొండ తన కుటుంబంతో దీపావళి పండగ చేసుకున్నట్టు ఫోటోస్ పెట్టాడు, అలాగే టపాకాయలు కాలుస్తున్నట్టుగా కూడా ఫోటోస్ పెట్టాడు. అదే సమయంలో రష్మిక మందన్న కూడా అభిమానులకి శుభాకాంక్షలు చెపుతూ చీరలో అందంగా వున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. అయితే నెటిజన్స్ ఊరుకోరు కదా, వాళ్ళు వెంటనే ఆ వెనకాల గోడ విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోస్ లో వున్న గోడ ఒకటేలా కనిపిస్తున్నాయి అని అన్నారు. (Netizens trolling Vijay and Rashmika again)
ఇంకేముంది రష్మిక ఈ దీపావళి విజయ్ ఇంట్లో జరుపుకుంది అని ఇక ఒకటే ట్రోల్ చెయ్యడం మొదలెట్టారు. కొన్ని రోజుల క్రితమే రష్మిక డీప్ ఫేక్ వీడియో #DeepFakeVideo ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాని మీద చాలామంది రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమ నుండి, అలాగే ఇతర సెలబ్రిటీస్ చాలామంది స్పందించి ఆ వీడియోని ఖండించిన సంగతి కూడా తెలిసిందే. అప్పుడు అందరూ రష్మిక కి మద్దతు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.
అది ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు రష్మిక, విజయ్ జంట మీద ట్రోలింగ్ చేస్తున్నారు. రష్మిక, విజయ్ మధ్యలో ఎదో ఉందని కొన్ని రోజుల నుండి సాంఘిక మాదేమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళి ఫోటోలతో మళ్ళీ ఈ ఇద్దరూ ఇప్పుడు వార్తల్లో వున్నారు.