Naveen Medaram: ‘డెవిల్’ సినిమాపై ఎటువంటి చట్టపరమైన చర్యలకి వెళ్లడం లేదు
ABN, Publish Date - Dec 27 , 2023 | 05:12 PM
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘డెవిల్’ విడుదల సమయంలో ఏమైనా కాంట్రవర్సీకి లోనవుతుందనేలా ఫస్ట్ నుండి టాలీవుడ్‌లో అనుమానాలున్నాయి. అందుకు కారణం ఈ సినిమాకి మొదట నవీన్ మేడారం అనే దర్శకుడు పనిచేశారు. కానీ అతన్ని తొలగించి నిర్మాతే మెగా ఫోన్ పట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. తాజాగా ‘డెవిల్’ విషయంలో తన తప్పేం లేదని తెలుపుతూ నవీన్ మేడారం ఓ లేఖను విడుదల చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కిన ‘డెవిల్’ (Devil) మూవీ విడుదల సమయంలో ఏమైనా కాంట్రవర్సీకి లోనవుతుందనేలా మొదటి నుండి టాలీవుడ్‌లో అనుమానాలున్నాయి. అందుకు కారణం ఈ సినిమాకి మొదట నవీన్ మేడారం (Naveen Medaram) అనే దర్శకుడు పనిచేశారు. కొన్ని కారణాల వల్ల అతని స్థానంలో చిత్ర నిర్మాతే మెగా ఫోన్ పట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అయితే 80 శాతం సినిమా షూటింగ్ అనంతరం తనని తప్పించి.. మిగతా 20 శాతం వారు డైరెక్ట్ చేసుకుని సినిమాని విడుదల చేస్తున్నారనేలా ఆ మధ్య దర్శకుడు నవీన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా అతను ఎటువంటి రచ్చ చేయలేదు. అయితే సినిమా విడుదలవుతోన్న సమయంలో మళ్లీ ఏమైనా కాంట్రవర్సీ (Controversy) చేస్తాడేమో అనేలా అనుమానాలు వ్యక్తమవుతోన్న తరుణంలో.. స్వయంగా నవీన్ మేడారం ఓ లేఖను విడుదల చేసి.. ఈ సినిమాకు సంబంధించి ఎవరిపై చట్టపరమైన చర్యలకు వెళ్లడం లేదని ప్రకటించారు. అయితే ‘డెవిల్’కి 80 శాతం షూటింగ్ పూర్తి చేయడమే కాకుండా.. మొదటి నుండి బేబీలా చూసుకున్న తనకు దర్శకుడిగా గుర్తింపును ఇవ్వకపోవడమే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు నవీన్ మేడారం విడుదల చేసిన లేఖలో ఏముందంటే.. (Naveen Medaram Letter on Devil)
‘‘ ‘డెవిల్’ సినిమాకి ప్రాణం పోసేందుకు దాదాపు మూడేళ్లు శ్రమించాను. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రాయడం, కాస్ట్యూమ్స్, సెట్స్, ఆర్టిస్ట్‌ల ఎంపిక, లొకేషన్స్ ఎంపిక.. ఇలా సినిమాలోని ప్రతి అంశాన్ని నా ఆలోచనకు తగ్గట్టుగా రెడీ చేశాను. కారైకుడి, హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో.. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా.. దాదాపు 105 రోజుల పాటు ఈ సినిమాకు కష్టపడి షూటింగ్ చేశాను. నేను అనుకున్నవిధంగా ‘డెవిల్’ను తెరకెక్కించా. నా వరకూ ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది నా బిడ్డలాంటిది. ఎవరు ఎన్ని చెప్పినా సరే.. ఇది పూర్తిగా నా చిత్రమే.
ఇప్పటి వరకూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను మౌనంగా ఉన్నా. అయితే, నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని.. నేను ఏదో తప్పు చేసినట్లుగా భావిస్తుండటం బాధేస్తుంది. అందుకే ఈ చిత్రం విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని క్లారిటీ ఇచ్చేందుకే ఈ లేఖను విడుదల చేస్తున్నాను. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని అజాగ్రత్తతో కూడిన నిర్ణయాల ఫలితంగానే ఈరోజు ఇలాంటి వివాదం మొదలైంది. ఇటీవల ప్రచురితమవుతోన్న కథనాల్లో చెప్పినట్లు.. సినిమా, లేదా చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. కానీ దర్శకుడిగా నాకు క్రెడిట్ ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నాను. నా నైపుణ్యంపై నాకు నమ్మకం ఉంది. శ్రద్ధ, నిబద్ధతతో నా కెరీర్‌ను మలుచుకుంటున్నాను. కచ్చితంగా మరింత ధైర్యంగా కమ్‌బ్యాక్ ఇస్తాను.
‘డెవిల్’ కోసం కల్యాణ్‌రామ్‌గారు ఎంతో శ్రమించారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో నాకు అండగా నిలిచిన కల్యాణ్‌రామ్‌గారితో పాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ‘డెవిల్’ తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నా. డిసెంబర్ 29న ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించాలని కోరుకుంటున్నాను. కొత్త చిత్రానికి సైన్ చేశా... దాని కోసం ఆసక్తికరమైన స్క్రిప్ట్‌ని రెడీ చేస్తున్నా. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తాను. ధన్యవాదాలు’’ అని నవీన్ ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
====================
*Ravi Teja: ‘హను-మాన్’కి ‘ఈగల్’ సపోర్ట్
***************************
*Sriya Reddy: ‘సలార్’ పార్ట్ 1లో ఏం చూశారు.. అసలు విషయం పార్ట్ 2లో..
************************
*Kalyan Ram: ఏ విషయమైనా క్లారిటీ ఉంటేనే.. నేను, తమ్ముడు తారక్ స్పందిస్తాం
*****************************
*Thandel: సముద్రం మధ్యలో.. చైతూ ‘తండేల్’ అప్‌డేట్
**************************