సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..

ABN, First Publish Date - 2023-03-06T23:38:48+05:30

‘ఏదైనా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్’.. ఏ ముహూర్తాన బోయపాటి (Boyapati) ఈ డైలాగ్ రాయించాడో కానీ.. బాలయ్య (Balayya) ఇప్పుడా డైలాగ్‌కు పరిపూర్ణ న్యాయం చేస్తున్నారు. ఇంతకు ముందు

Balakrishna Nandamuri
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఏదైనా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్’.. ఏ ముహూర్తాన బోయపాటి (Boyapati) ఈ డైలాగ్ రాయించాడో కానీ.. బాలయ్య (Balayya) ఇప్పుడా డైలాగ్‌కు పరిపూర్ణ న్యాయం చేస్తున్నారు. ఇంతకు ముందు బ్రాండ్ అంబాసిడర్ (Brand Ambassador) అంటే కుర్ర హీరోలే అన్నట్లుగా ఉండేది. ముఖ్యంగా మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్‌ (Allu Arjun)ల పేర్లు మాత్రమే వినబడేవి. కానీ బాలయ్య ‘ఆహా’ (Aha) అంటూ అన్‌స్టాపబుల్‌ (Unstoppable)లోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో.. పబ్లిక్‌కి ఆయనేంటో తెలిసింది. ఆయన మనసు ఎలా ఉంటుందో అర్థమైంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను బ్రాండ్ అంబాసిడర్‌‌గా చేసుకునేందుకు పలు కంపెనీలు ఎగబడుతున్నాయంటే.. ఏ రేంజ్‌లో ఆయన క్రేజ్ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ లిస్ట్‌లో ముందుగా అవకాశం దక్కించుకుంది వేగా శ్రీ (Vega Sri) జ్యూవెలర్స్.

ఆయన హోస్ట్ చేసిన ‘ఆహా’ అన్‌స్టాపబుల్ టాక్ షో.. తిరుగులేని షోగా మారిన విషయం తెలిసిందే. సినిమాలు, టాక్ షోలు మాత్రమే కాకుండా కమర్షియల్ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కూడా బాలయ్య సత్తా చాటుతున్నారు. బాలయ్య వేగా శ్రీ జ్యూవెలర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ బ్రాండ్‌కి సంబంధించి రీసెంట్‌గా యాడ్ షూట్ కూడా నిర్వహించారు. ఈ యాడ్‌లో నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా కనిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ని, బిహైండ్ ది సీన్స్‌ని తాజాగా శ్రేయస్ మీడియా సంస్థ యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది. ఈ వీడియో అభిమానులకు పండుగలా మారింది. వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బాలయ్య మార్చి 8న విజయవాడలో ప్రారంభం కానున్న కొత్త బ్రాంచ్‌కు హాజరు కానున్నారు. మార్చి 8న మధ్యాహ్నం వేగా జ్యూవెలర్స్ బ్రాంచ్‌ను ఓపెనింగ్ చేయనున్నారు బాలయ్య. (Nandamuri Balakrishna Vega Sri Jewellers)

ఇదిలా ఉంటే ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించిన మేకింగ్ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ మేకింగ్ గుర్రం ఆనంద్ కుమార్ డైరెక్ట్ చేయగా.. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal), సంజన ఆనంద్ నటించారు. ఈ యాడ్ పూర్తిగా శ్రేయస్ మీడియా నేతృత్వంలో తెరకెక్కడం విశేషం. ఈ యాడ్ షూట్‌లో బాలకృష్ణ ట్రెడిషనల్ వేర్‌లో ఎంతో గ్లామరస్ కనిపిస్తున్నారు. ఆయన ఆహార్యంలో రాజసం ఉట్టిపడుతోంది. అలాగే హీరోయిన్ ప్రగ్యా కూడా చీరలో ఎంతో అందంగా దర్శనమిచ్చింది. ఇదే కాదు.. ఇప్పుడు బాలయ్యని బ్రాండ్‌గా చేసుకునేందుకు పలు కంపెనీలు ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లుగా సమాచారం. త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయనేలా టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

Updated Date - 2023-03-06T23:38:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!