Rangabali: సక్సెస్ మీట్‌లో జర్నలిస్ట్ అడిగిందేంటి?.. దానికి నాగశౌర్య అంత ఫీలయ్యాడేంటి?
ABN, First Publish Date - 2023-07-08T20:54:51+05:30
నాగశౌర్య, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో చేసిన చిత్రం ‘రంగబలి’. యుక్తి తరేజ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జూలై 7న విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోంది. తాజాగా చిత్రయూనిట్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించగా.. అందులో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నాగశౌర్య సీరియస్‌గా సమాధానం చెప్పి.. చేతులు కొట్టుకుంటూ లేచి వెళ్లిపోయారు.
నాగశౌర్య (Naga Shaurya), నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి (Pawan Basamsetty) దర్శకత్వంలో చేసిన చిత్రం ‘రంగబలి’ (Rangabali). ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. యుక్తి తరేజ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జూలై 7న విడుదలై మిక్స్‌డ్ టాక్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా చాలా బాగుందని, సెకండాఫ్ కాస్త డిజప్పాయింట్ చేసిందనేలా.. టాక్ బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న వసూళ్లతో హ్యాపీగా ఉన్నట్లుగా తెలిపేందుకు శనివారం చిత్రయూనిట్ ఓ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న.. దర్శకుడికి అర్థం కాకపోవడంతో.. నాగశౌర్య మైక్ తీసుకుని క్లారిటీ ఇచ్చినా.. ఆ తర్వాత ఫీలవుతూ.. స్పీడ్‌గా కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయారు.
అసలు జర్నలిస్ట్ (Journalist) అడిగిన ప్రశ్న ఏమిటంటే..
సదరు జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలో మ్యాటర్ ఉన్నప్పటికీ.. అడిగే విధానంలో కాస్త క్లారిటీ మిస్సయింది. దీంతో ఆ ప్రశ్న దర్శకుడికి అర్థం కాలేదు. జర్నలిస్ట్ అడిగిన లాజిక్.. నాగశౌర్యకు మాత్రం బాగానే అర్థమైంది. దానికి సరిపడిన వివరణ కూడా ఇచ్చారు. కానీ.. చివరిలో అలా చేతులు కొట్టి లేచి వెళ్లిపోవడంతో.. శౌర్య ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నాడు. ఇంతకీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏమిటంటే.. ఆయన అడిగిన విధానంలో కాకుండా.. ఇక్కడ క్లారిటీగా చెప్పుకుందాం. నాగశౌర్య ప్రేమించిన అమ్మాయి వాళ్ల తండ్రి.. రంగబలి సెంటర్ పేరు చెప్పగానే వారి పెళ్లికి అడ్డు చెబుతాడు. అయితే నాగశౌర్య ఉండే ఊరిలో.. పెద్ద తోపు అని ఫీలవుతుంటాడు హీరో. అలాంటి తోపుకి.. మురళీశర్మ ఎందుకు రంగబలి సెంటర్ విషయంలో భయపడ్డాడో తెలియదా? ఆ ఊరిలో చీమ చిటుక్కుమంటే తెలిసిపోయే నాగశౌర్యకి.. ఆ విషయం తెలియకపోవడం ఏమిటి? అనే లాజిక్‌ని జర్నలిస్ట్ అడిగారు.
దీనికి దర్శకుడు.. ఆ జర్నలిస్ట్‌ని మనిద్దరం కలిసి సినిమా చూద్దాం.. మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావడం లేదని అంటే.. శౌర్య మైక్ తీసుకుని.. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైందండి అంటూ.. (Naga Shaurya Reaction) ‘‘ఆ హీరోకి ఇంకా 45, 50 ఏళ్లు రాలేదు. పంచె కట్టుకుని నలుగురిలో కూర్చొని మాట్లాడడం.. పూర్వం ఏం జరిగిందో తెలుసు, ఇప్పుడు జనరేషన్‌కు ఏం మెసేజ్ ఇవ్వాలి అని మాట్లాడే తరహా హీరో కాదు. హీరోది వెరీ యంగ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్. ప్రతీది నాకే తెలుసు అనుకునే క్యారెక్టర్. ఇప్పుడు ఎవరో ఒకరు రోడ్డు వేశారు. ఆ రోడ్డుకు ఎందుకు ఆ పేరు పెట్టారో తెలుస్తుంది కానీ.. ఆ రోడ్డు వేయడానికి ఉన్న చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఐడియా ఆ ఏజ్‌లో ఏ కుర్రాడికీ ఉండదు. ఇది సింబాలిక్. దీన్ని కూడా స్టోరీలో పెట్టుకోవాలంటే మా సినిమా 16 గంటలు, 20 గంటలు పైనే ఉంటుంది. ఇక ‘బాహుబలి’ అయితే మీరు అడగద్దు. కొన్ని సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి కొన్ని కొన్ని అర్థం చేసుకుని వదిలేయాలి సార్’’ అని కోపంతో తన రెండు చేతులను కొట్టుకుంటూ స్టేజ్ మీద నుంచి లేచి వెళ్లిపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
**************************************
*BroTheAvatar: మై డియర్ మార్కండేయ.. మనల్ని ఆపే మగాడెవడు ‘బ్రో’..!
**************************************
*Nayakudu: ‘నాయకుడు’కి రాజమౌళి, మహేష్ బాబు సపోర్ట్
**************************************
*Ticket Prices Hike: సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై రచ్చ రచ్చ
**************************************
*Bedurulanka 2012: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి మరో సినిమా..
**************************************
*Aadikeshava: ఆగస్ట్ లిస్ట్‌లోకి మరో మెగా హీరో మూవీ.. చిరు, వరుణ్‌ల మధ్యలో స్లాట్ దొరికేసింది
**************************************