Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..
ABN, First Publish Date - 2023-03-09T18:11:11+05:30
యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! (ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో, అక్కడ దేవతలు నివసిస్తారు) అని పురాణాలలో చెప్పబడింది. కానీ, స్వాతంత్య్ర భారతదేశం (India)లో..
యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! (ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో, అక్కడ దేవతలు నివసిస్తారు) అని పురాణాలలో చెప్పబడింది. కానీ, స్వాతంత్య్ర భారతదేశం (India)లో స్త్రీకి మాత్రం ఇంకా అటువంటి గుర్తింపు దక్కలేదనే చెప్పుకోవాలి. ‘అర్ధరాత్రి మహిళ.. ఒంటరిగా రోడ్డుపై నడవగలిగినప్పుడే.. నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు’ అని గాంధీ (Gandhi)గారు చెప్పారు. కానీ, ఇంకా ఆ మాట చెప్పుకుంటూనే ఉన్నాం కానీ.. ఆయన చెప్పిన అసలైన స్వాతంత్ర్యం (Independence) ఇంకా రాలేదని మాత్రం ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోని చూస్తుంటే.. ‘కంచె చేను మేస్తే పంటను కాపాడేదెవరు’ అనే సామెత గుర్తుకు రాక మానదు. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సిన ఓ పోలీస్ అధికారి (Police Officer).. అర్ధరాత్రి ఓ మహిళపై అమానుషంగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫైర్ అవుతున్నారు. తాజాగా మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘రక్తం మరిగిపోతోంది’ (Blood boils) అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
అసలు మంచు లక్ష్మి రియాక్ట్ అయిన వీడియోలో ఏముందంటే..
ఓ పోలీస్ అధికారి.. రోడ్డుపై వెళుతున్న ఓ యువతిని ఆపి.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. తాకరాని చోట్ల ఆమెను తాకుతూ ఇబ్బందికి గురి చేస్తున్నాడు. అతన్ని వదిలించుకుని.. ఆమె వెళుతున్నా కూడా వదలకుండా.. ఆమెను వెంబడించాడు. ఈ షాకింగ్ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి కనిపించకుండా వీడియో తీసి.. సోషల్ మాధ్యమాలలో షేర్ చేశాడు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్ (Bhopal)లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. భోపాల్‌లోని హనుమాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లుగా తెలుస్తున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను భారత సంతతికి చెందిన స్వీడన్ ప్రొఫెసర్ అశోక్ స్వైన్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. ‘రక్తం మరిగిపోతోంది’ అంటూ మంచు లక్ష్మి కోపోద్రిక్తమైంది.
ఒక్క మంచు లక్ష్మి మాత్రమే కాదు.. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. వెంటనే ఆ పోలీస్‌పై యాక్షన్ తీసుకోవాలనేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన స్వీడన్ ప్రొఫెసర్ అశోక్ స్వైన్ (Ashok Swain) అయితే ఇండియానే తప్పుబట్టారు. ‘మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ఇండియా ఎందుకు మారింది? ఆఖరికి పోలీస్ కూడా మధ్యప్రదేశ్‌లోని ఒక వీధిలో మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై ప్రముఖులెందరో కామెంట్స్ చేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఆయన ఈ వీడియోని షేర్ చేయడం. ఈ విషయాన్ని నెటిజన్లు హైలెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో
*NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..
*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..
*Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్
*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..