కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Malavika Mohanan: అభిమానుల మనసుల్లో మాళవిక గిలిగింతలు

ABN, First Publish Date - 2023-11-15T12:46:41+05:30

మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కు దిగుమతి అయిన భామల్లో మాళవిక మోహనన్‌ ఒకరు. తమిళ సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. మరోవైపు, సోషల్‌ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ.. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఆమె షేర్‌ చేసే ఫొటోలు అభిమానుల మనసుల్లో గిలిగింతలు పెట్టిస్తున్నాయి. తాజాగా ఆమె కొన్ని ఫొటోలను షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

Malavika Mohanan

మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కు దిగుమతి అయిన భామల్లో మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) ఒకరు. తమిళ సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. మరోవైపు, సోషల్‌ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ.. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఆమె షేర్‌ చేసే ఫొటోలు అభిమానుల మనసుల్లో గిలిగింతలు పెట్టిస్తున్నాయి. తాజాగా దీపావళి (Diwali) పండుగను పురస్కరించుకుని ఆమె కొన్ని ఫొటోలను సోషల్ మీడియాకు వదిలింది. ఈ ఫొటోలలో ఆమెను చూసిన వారంతా.. వావ్ అనేస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో ఈ ఫొటోలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఫొటోలకు మాళవిక మోహనన్ ‘ఐ థింక్‌ ఐ క్లీన్‌ అప్‌ వెల్‌’ (I think I clean up well) అనే క్యాప్షన్‌ జోడించింది. ఈ స్పెషల్ క్లిక్స్‌లో ఆమె ధరించిన డిజైనర్స్ అన్నీ కూడా మెరిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె అభిమానులైతే ఆమెను దేవత అంటూ సంబోధిస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు చేస్తున్న కామెంట్స్, రీ ట్వీట్స్‌తో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా.. మాళవిక (Malavika)ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేశాయి.


ఇక మాళవిక చేస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth), ఇళయ దళపతి విజయ్‌ (Vijay), ధనుష్‌ (Dhanush) వంటి హీరోల సరసన నటించిన మాళవిక.. పా.రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ (Vikram) హీరోగా నటించిన ‘తంగలాన్‌’ (Thangalaan)లో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న విడుదలకానుంది. అలాగే టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మారుతి (Maruthi) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ మాళవిక ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎటువంటి వివరాలు బయటికి రాలేదు.


ఇవి కూడా చదవండి:

========================

*Aishwarya Rai: ఐష్ టాయిలెట్స్ కడగడానికి కూడా ఆ క్రికెటర్ పనికిరాడంటూ.. నెటిజన్లు ఫైర్

*********************************

*Radha Madhavam: వినాయక్ హీరోగా ‘రాధా మాధవం’.. ఫస్ట్ లుక్ విడుదల

*********************************

*Roti Kapda Romance: యూత్‌ని ఆకర్షించేలా ‘రోటి కపడా రొమాన్స్’ ఫస్ట్ లుక్

*****************************

*Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. ‘దేవర’ నుండి క్రేజీ అప్‌డేట్!

*****************************

Updated Date - 2023-11-15T12:46:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!