కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kiran Abbavaram: బిగ్‌ బాస్ రతికతో పెళ్లి అనగానే.. కిరణ్ అబ్బవరం రియాక్షన్ చూశారా..

ABN, First Publish Date - 2023-10-05T08:12:41+05:30

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఈ సినిమా అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా కాసేపు నెటిజన్లతో వీడియో చిట్ చాట్ చేశారు. ఈ చాట్‌లో ఓ నెటిజన్ బిగ్ ‌బాస్ రతిక వంటి అమ్మాయిని చేసుకోమని అడుగగా.. వామ్మో నా మీద ఏమైనా పగ ఉందా? అంటూ కిరణ్ అబ్బవరం సమాధానమిచ్చాడు.

Kiran Abbavaram and Rathika

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann). ఈ సినిమా అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. హీరో కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా కాసేపు నెటిజన్లతో వీడియో చిట్ చాట్ చేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చే వీడియోలను పోస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఓ నెటిజన్ అడిగిన ఆసక్తికర ప్రశ్నకు ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత తేరుకుని.. సమాధానం చెప్పుకొచ్చారు. ఇంతకీ నెటిజన్ అడిగిన ప్రశ్న ఏమిటని అనుకుంటున్నారా?

‘రూల్స్ రంజన్ సినిమా హిట్ అయిన తర్వాత బిగ్ బాస్ ఫేమ్ రతిక వంటి అమ్మాయితో నీకు పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్ట్’ అని నెటిజన్ కామెంట్ చేయగా.. దీనికి కిరణ్ అబ్బవరం స్పందిస్తూ.. ‘బాబు గుడుంబా.. ఎందుకమ్మా నా మీద నీకు అంత పగ. పెళ్లి అయితే చేసుకుందాం కానీ.. రాని ఎలాంటి అమ్మాయి వ‌స్తుందో చూద్దాం’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘నీకు మంచి అమ్మాయి వస్తుంది కిరణు.. మన సీమ అమ్మాయినే చేసుకో’, ‘టిల్లులో రాధిక అనుకున్నాడా.. రతిక (Rathika) అనే అనుకున్నాడా.. ఎందుకు అంత పగ అని డైరెక్ట్‌గా అనేశాడు’, ‘సినిమాలో కంటే ఇక్కడే ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నావ్ అన్నా’ అంటూ నెటిజన్లు చేసే కామెంట్స్‌తో ఈ వీడియో వైరల్ అవుతోంది. (Kiran Abbavaram Chit Chat)


ఇక నెటిజన్ కోరిన రతిక విషయానికి వస్తే.. రీసెంట్‌గానే రతిక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయి వెళ్లిపోయే సమయంలో బాగా ఎమోషనల్ కూడా అయింది. నాగార్జున (Nagarjuna) ఏమైనా ఫ్రాంక్ చేస్తున్నాడేమో.. ఫ్రాంక్ ఎలిమినేషన్ ఏమో అనుకుంది కానీ.. అది జరగలేదు. ఆమె ఎలిమినేట్ అవడానికి కారణం మాత్రం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌‌కు వెన్నుపోటు పొడవడంతో పాటు ప్రిన్స్ యావర్‌ విషయంలో ఆమె బిహేవియర్, హౌస్‌లో తన అవసరం కోసం ఆమె నడిపిన లవ్‌ ట్రాక్స్‌ వంటి వన్నీ ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే ఆమెకు ఓటింగ్ పడలేదు. ఫలితంగా ఆమె హౌస్ వదిలేసి బయటికి రావాల్సి వచ్చింది. అందుకే ఆ అమ్మాయి పేరు చెప్పగానే.. కిరణ్ అబ్బవరం అలా వెన్నుపోటు పొడిచే అమ్మాయి ఎందుకు? అనేలా రెస్పాండ్ అయ్యారు.


ఇవి కూడా చదవండి:

============================

*Lethakulu: ఎస్తర్ కీలకపాత్రలో నటిస్తోన్న సినిమా టైటిల్ ఇదే..

******************************

*Yendira Ee Panchayithi: ‘ఏందిరా ఈ పంచాయితీ’కి సెన్సార్ ఏ సర్టిఫికేట్ జారీ చేసిందంటే..

******************************

*Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసు వ్యవహారంలో నా పేరు ఎందుకు హైలెట్ అయ్యిందంటే?

***********************************

*Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మాసివ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్

********************************

*Sudheer Babu: ‘మామా మశ్చీంద్ర’.. మహేష్ బాబులా పరుగెడుతుంది

*********************************

Updated Date - 2023-10-05T08:12:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!