Keerthy Suresh: స్విమ్మింగ్‌పూల్‌లో.. ఫొటోలు వైరల్
ABN, First Publish Date - 2023-01-12T15:59:01+05:30
తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh). ఈ భామకి ఏమాత్రం ఖాళీ సమయం
తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh). ఈ భామకి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా చాలు.. జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుంటుంది. ప్రస్తుతం తమిళంలో ‘మామన్నన్’, ‘సైరన్’ వంటి చిత్రాల్లో నటించిన కీర్తిసురేష్ తెలుగులో ‘భోళాశంకర్’ (Bhola Shankar), ‘దసరా’ (Dasara) వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలన్నీ విడుదలకావాల్సి ఉన్నాయి. అదేసమయంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే కీర్తి... ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో విహరిస్తోంది. అక్కడ ఓ ఈతకొలనులో ఆమె జలకాలాడుతున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతూ.. లైకుల వర్షం కురిపిస్తున్నారు.
ఈతకొలనులో ఉన్న ఫొటోలతో పాటు.. బీచ్ ఒడ్డున ఉన్న సన్‌రైజ్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలను కూడా ఆమె యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ‘మహానటి’ (Mahanati) చిత్రంతో జాతీయ అవార్డ్‌ను అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో లాక్డౌన్ సమయంలో సందడి చేసింది. అయితే అవేవీ ఆమెకు హిట్‌ని అందించలేకపోయాయి. దీంతో మళ్లీ ఆమె భారీగా తగ్గి.. హీరోల సినిమాలలో యాక్ట్ చేస్తోంది. రీసెంట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) సరసన ఆమె నటించిన.. ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో చిరుకి చెల్లెలిగా ‘భోళాశంకర్’లో చేస్తుండగా.. నాని సరసన ‘దసరా’ సినిమా చేస్తోంది.