సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhagavanth Kesari: చిలకపచ్చ కోక.. కాజల్, శ్రీలీల చింపి ఆరేశారు

ABN, First Publish Date - 2023-06-19T20:26:24+05:30

కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్‌గా తాజాగా ‘భగవంత్ కేసరి’ చిత్రయూనిట్ ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కలిసి బాలయ్య ‘నరసింహనాయుడు’ చిత్రంలోని ‘చిలకపచ్చ కోక’ సాంగ్‌కి దుమ్ములేచిపోయేలా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియోతో ‘భగవంత్ కేసరి’ చిత్రం మరోసారి వార్తలలో హైలెట్ అవుతోంది.

Kajal Aggarwal and Sreeleela Dance
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నందమూరి నటసింహ బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పుట్టినరోజును పురస్కరించుకుని.. ఈ సినిమాలోని ఆమె లుక్‌ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది చాలదు అన్నట్లుగా.. ఫ్యాన్స్‌కి చిత్రబృందం మరో ట్రీట్ ఇచ్చింది.

నటసింహం నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలోని ‘చిలకపచ్చ కోక’ సాంగ్‌ (Chilaka Pachha Koka Song)కు కాజల్ అగర్వాల్, శ్రీలీల (Sreeleela) డ్యాన్స్ చేస్తున్న వీడియోని తాజాగా వదిలారు. ఈ పాటలో ఇద్దరు హీరోయిన్లు డ్యాన్స్ ఇరగదీశారు. ఇంకా చెప్పాలంటే చిలకపచ్చ కోకని.. చింపి ఆరేశారు. అంతకుముందు బాలయ్య పాటకి అనిల్ రావిపూడి డ్యాన్స్ చేసిన వీడియోకి కంటిన్యూ అన్నట్లుగా కామెడీగా స్టార్ట్ చేసి.. ఇద్దరు హీరోయిన్లు ఊరమాస్ స్టెప్స్‌తో అలరించారు. అయితే ఈ ఇద్దరి హీరోయిన్లలో ఈ పాటకు ఎవరు బాగా డ్యాన్స్ చేశారు? అంటూ సరదాగా కామెంట్స్ మొదలయ్యాయి. వాస్తవానికి ఈ పాటలో శ్రీలీల స్టెప్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. శ్రీలీలను కాజల్ మ్యాచ్ చేయలేకపోయింది.. ఏజ్ తేడా కనబడింది. అయితే ఇద్దరూ కూడా యమా యాక్టివ్‌గా ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రీసెంట్‌గా బాలయ్య పుట్టినరోజున చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్‌ను వదిలిన మేకర్స్.. ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ క్రష్ శ్రీలీల లుక్‌ని కూడా ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. సోమవారం కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ఇప్పుడు వదిలిన డ్యాన్స్ వీడియో (Dance Video)తో మరోసారి ‘భగవంత్ కేసరి’ టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) విలన్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ థమన్ (S Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని విజయదశమి (దసరా)కి థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Kajal Aggarwal: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి బర్త్‌డే ట్రీట్..

**************************************

*Adipurush Collections: ఆ రెండూ ఊహించినవే కానీ.. ఈ ఏరియాలో మాత్రం ప్రభాస్‌కి కోలుకోలేని దెబ్బే!

**************************************

*Sitara: చిచ్చర పిడుగులా చెలరేగిపోతోన్న మహేష్ తనయ.. సాయిపల్లవిని దించేసింది

**************************************

*Spy: మరో పాన్ ఇండియా సంచలనానికి సిద్ధమైన నిఖిల్.. ఎప్పుడంటే?

**************************************

Updated Date - 2023-06-19T20:26:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!