సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heroines: పెళ్లి ముహూర్తానికి వేళాయెరా..

ABN, First Publish Date - 2023-06-20T18:16:04+05:30

విశ్వసుందరి అయినా.. గ్రామసుందరి అయినా తగిన సమయంలో వివాహం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. గతంలో ఎంతో బిజీగా కెరీర్‌ను కొనసాగిస్తున్న తరుణంలోనే నటీమణులు పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితంతో పాటు కుటుంబ జీవితాన్ని విజయవంతంగా గడుపుతున్నారు. ఈ 2కే కాలంలో త్రిష, అనుష్క, అంజలి, ప్రియా భవాని శంకర్ వంటి వారు బ్యాచ్‌లర్స్‌గానే కొనసాగుతున్నారు. వారికీ పెళ్లి ఘడియలు దగ్గర పడినట్లుగా టాక్ నడుస్తోంది.

Trisha, Priya Bhavani Shankar and Anushka
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వసుందరి అయినా.. గ్రామసుందరి అయినా తగిన సమయంలో వివాహం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. గతంలో ఎంతో బిజీగా కెరీర్‌ను కొనసాగిస్తున్న తరుణంలోనే సీనియర్‌ నటీమణులు అంబిక, రాధ, నదియ, ఖుష్బూ, రమ్యకృష్ణ, రంభ, రోజా, సిమ్రాన్‌, షాలిని, జ్యోతిక, నమిత, కాజల్ అగర్వాల్ వంటి స్టార్‌ హీరోయిన్లు వివాహాలు చేసుకుని, తమ వైవాహిక జీవితంతో పాటు కుటుంబ జీవితాన్ని విజయవంతంగా గడుపుతున్నారు. అయితే, ఈ 2కే కాలంలో పలువురు హీరోయిన్లు మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ హీరోయిన్లు (Most Eligible Bachelor Heroines) గానే కొనసాగుతున్నారు.

అలాంటి వారిలో అనుష్క (Anushka), త్రిష (Trisha), ప్రియా భవానీ శంకర్‌, విమలా రామన్‌, తమన్నా, రష్మికా మందన్న, అంజలి తదితరులున్నారు. వీరిలో త్రిషకు కొన్నేళ్ళ క్రితమే ఒక వ్యక్తితో నిశ్చితార్థమైంది. కానీ, అది రద్దు అయింది. ఇపుడు ఆమె వయసు మూడు పదులు దాటిపోయింది. దీంతో ఆమెను ఓ ఇంటికి కోడలిని చేసేందుకు త్రిష తల్లిదండ్రులు సరైన వరుడి కోసం గాలిస్తున్నారు. మరో వైపు ఆమె చేతినిండా అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది. అనుష్క పెళ్లిపై వార్తలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ప్రభాస్ అన్నారు.. తర్వాత కాదన్నారు. ఇప్పుడో బిజినెస్‌మ్యాన్‌తో ఆమె పెళ్లి ఉంటుందనేలా వార్తలైతే వస్తున్నాయి కానీ.. క్లారిటీ మాత్రం లేదు. ఇక హీరోయిన్‌ తమన్నా (Tamanna Bhatia).. తాజాగా బాలీవుడ్‌ నటుడు విజయ్‌వర్మ (Vijay Varma)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ప్రకటించారు.

కోలీవుడ్ నటి ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar).. ‘మేయాద మాన్‌’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. సినీ ఇండస్ట్రీలోకి రాకముందే పదేళ్ళుగా రాజవేల్‌ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో ఉన్నారు. ఈ ప్రేమ విషయాన్ని కూడా ఇటీవలే బహిర్గతం చేశారు. తన ప్రియుడితో కలిసి త్వరలోనే పెళ్ళి పీటలపై కూర్చోనున్నట్టు ఆమె తాజాగా వెల్లడించారు. విమలా రామన్‌ (Vimala Raman).. దర్శకుడు కె.బాలచందర్‌ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘పొయ్‌’లో పరిచయమైన ఆమె... ‘ఉన్నాలే ఉన్నాలే’ చిత్రం ద్వారా పరిచయమైన వినయ్‌ రాయ్‌ను ప్రేమిస్తున్నారు. ఇరు కుటుంబ పెద్దల అనుమతితో త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. వీరు కాకుండా అంజలి (Anjali), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh)లు కూడా పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) విషయానికి వస్తే.. పెళ్లి పీటల వరకు వెళ్లి.. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందీ భామ. ప్రస్తుతం అవకాశాలు పుష్కలంగా ఉండటంతో.. రష్మిక మ్యారేజ్‌కి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. వీరు కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్లు.. సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి బాట పట్టే పనిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Rakesh Master: గురువు రాకేశ్ మాస్టర్ భౌతికకాయం చూసి కన్నీరుమున్నీరైన శిష్యులు


**************************************

*Bhagavanth Kesari: చిలకపచ్చ కోక.. కాజల్, శ్రీలీల చింపి ఆరేశారు


**************************************

*Kajal Aggarwal: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి బర్త్‌డే ట్రీట్..

**************************************

*Adipurush Collections: ఆ రెండూ ఊహించినవే కానీ.. ఈ ఏరియాలో మాత్రం ప్రభాస్‌కి కోలుకోలేని దెబ్బే!

**************************************

*Sitara: చిచ్చర పిడుగులా చెలరేగిపోతోన్న మహేష్ తనయ.. సాయిపల్లవిని దించేసింది

**************************************

Updated Date - 2023-06-20T18:16:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!