కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karthi: ‘ఖైదీ’ ఎలా సర్‌ప్రైజ్ చేసిందో.. ‘జపాన్’ కూడా అంతే..

ABN, First Publish Date - 2023-11-04T17:25:38+05:30

కోలీవుడ్ హీరో కార్తీ తన 25వ చిత్రం ‘జపాన్’తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘ఖైదీ’ ఎలా సర్‌ప్రైజ్ చేసిందో.. ‘జపాన్’ కూడా అంతే సర్‌ప్రైజ్ చేస్తుందని కార్తీ తెలిపారు.

Japan Movie Pre Release Event

కోలీవుడ్ హీరో కార్తీ (Hero Karthi) తన 25వ చిత్రం ‘జపాన్’ (Japan)తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ (Raju Murugan) దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ముఖ్య అతిథిగా.. దర్శకుడు వంశీ పైడిపల్లి, సుప్రియ యార్లగడ్డ అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో హీరో కార్తీ మాట్లాడుతూ.. (Karthi Speech at Japan Pre Release Event) ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు. నిజాయితీగా కష్టపడుతూ మన ప్రతిభని పెంచుకుంటూ వెళితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనడానికి ఉదాహరణ నాని. సహాయ దర్శకుడిగా మొదలై, నటుడిగా మారి, కొత్తకొత్త పాత్రలు చేస్తూ, కొత్త దర్శకులని, కొత్త కథలని ప్రోత్సహించే హీరో నాని. ఆయన ప్రతి సినిమాతో సర్ ప్రైజ్ ఇస్తారు. ‘దసరా’ సినిమాలో నానిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ‘జెర్సీ’ టైం లెస్ ఫిలిం. నాని నటన అద్భుతం. అందరినీ హత్తుకుంది. అలాగే తను నిర్మించే చిత్రాలు, వెబ్ షోస్ కూడా చాలా యూనిక్‌గా వుంటాయి. నాని వండర్ ఫుల్ జర్నీకి అభినందనలు. తన ‘హాయ్ నాన్న’ చిత్రానికి ఆల్ ది బెస్ట్. ‘హాయ్ నాన్న’ (Hi Nanna) పెద్ద విజయాన్ని అందుకోవాలి. ‘సర్దార్’ (Sardar) తర్వాత నాగార్జున (Nagarjuna) అన్నయ్య, అన్నపూర్ణ స్టూడియోస్ ‘జపాన్’ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున అన్నయ్య ఫస్ట్ షో చూసి ‘సర్దార్’ బాగా ఆడుతుందని కాల్ చేసి చెప్పారు. ఈ చిత్రానికి కూడా అలానే కాల్ చేస్తారనే నమ్మకం వుంది. వంశీ గారితో నాకు ఎంతో మంచి అనుబంధం వుంది.


జపాన్ మన కల్చర్‌లో ఉండిపోయే బలమైన కథ. దీనిని ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రజెంట్ చేయడానికి పెద్ద టెక్నిషియన్స్‌ని తీసుకొచ్చాం. ఎస్ రవి వర్మన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అలాగే జీవీ ప్రకాష్ చాలా మంచి స్కోర్ చేశారు. అను చాలా చక్కగా నటించింది. సునీల్‌తో కలిసి పని చేయడం మంచి అనుభవం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో నాకు మంచి అనుబంధం వుంది. నా 25వ చిత్రాన్ని వారి నిర్మాణంలో చేయడం ఆనందంగా వుంది. తప్పకుండా ఈ చిత్రం పెద్ద విజయాన్ని ఇస్తుందని నమ్మకం వుంది.

జపాన్ కథ విన్నప్పుడే నాకు నేను కొత్తగా మారాలని నిర్ణయించుకున్నాను. గెటప్‌తో పాటు వాయిస్‌ని కూడా ఇందులో మార్చాం. ఈ చిత్రం నా మనసుకు దగ్గరైన చిత్రం. రాజు మురగన్ సమాజం పట్ల ప్రేమ వున్న దర్శకుడు. ‘జపాన్’ (Japan) పాత్రలో స్వార్ధం వుంటుంది. ఈ సమాజం తనకి ఏది ఇచ్చిందో అదే తిరిగి ఇచ్చే పాత్ర తనది. వినోదంతో పాటు ఆలోచింపజేసే ప్రశ్నలు సంధించే చిత్రమిది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ‘ఖైదీ’ చూసినప్పుడు ఆ చిత్రాన్ని అసలు ఎలా ఒప్పుకున్నారని సర్‌ప్రైజ్ అయ్యారో.. ‘జపాన్’ చూసి కూడా అలానే సర్‌ప్రైజ్ అవుతారు. ‘జపాన్’ నాకు చాలా ముఖ్యమైన చిత్రం. నవంబర్ 10న రాబోతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్‌లో చూడండి..’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

========================

*Satyabhama: ‘సత్యభామ’గా కాజల్.. టీజర్ ఎప్పుడంటే?

***************************************

*Bharateeyudu 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇక లంచగొండులకు మూడినట్టే!

**************************************

Updated Date - 2023-11-04T17:25:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!