Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి
ABN, First Publish Date - 2023-03-13T19:03:14+05:30
విశ్వవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఆస్కార్ 2023 వేడుకల్లో రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల వస్త్రధారణ హైలెట్ అయిన విషయం తెలిసిందే. డిజైనర్, కస్టమ్ మేడ్ ఎటైర్‌లో చూపరుల దృష్టిని
విశ్వవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఆస్కార్ 2023 వేడుకల్లో రామ్‌చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల వస్త్రధారణ హైలెట్ అయిన విషయం తెలిసిందే. డిజైనర్, కస్టమ్ మేడ్ ఎటైర్‌లో చూపరుల దృష్టిని ఆకర్షించారు ఈ జంట. అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల పనితనాన్ని ప్రదర్శించేలా ఉన్నాయి వారి వస్త్రాలు. ఈవెంట్ ఏదైనా ఫ్యాషన్ ప్రియులను అలరించే అంశాలు కొన్ని ఉంటాయి. 2023 ఆస్కార్ వేడుకలో (Oscars2023 Event) గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Global Star Ram Charan) ఫ్యాషన్ ప్రియులను మెప్పించే వస్త్రాల్లో కనిపించారు. ఆయన వస్త్రాలను ఫ్యాషన్ డిజైనర్స్ శాంతను, నిఖిల్ రూపొందించారు. ఆర్ఆర్ఆర్‌లో ఆయన కేరక్టర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ వస్త్రాలను డిజైన్ చేశారు. మెడాలియన్ బటన్స్, చక్రాల్లాంటి బ్రోచెస్ కాస్ట్యూమ్స్‌కి స్పెషల్ ఆడిషన్‌లా అనిపించాయి. నిఖితా జైసింఘానీ స్టైలింగ్ చేశారు. మెగాపవర్‌స్టార్ (Mega Power Star) లుక్‌కి అభిమానులే కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్లు కూడా ఫిదా అయ్యారు. మెగా పవర్ స్టార్ ధరించిన కుర్తా, ఆయన స్టైల్‌లోనే ఉంటూనే, భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్న ఫ్యాషన్ ట్రెండ్‌కి అద్దంపట్టింది. వీటన్నిటికీ తోడు రెడ్ కార్పెట్ మీద తనదైన ప్రత్యేకమైన శైలిలో అలరించారు రామ్‌చరణ్.
ఇక రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Ram Charan Wife Upasana) కాస్ట్యూమ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. జయంతి రెడ్డి డిజైన్ చేసిన స్క్రాప్ రీసైలిక్డ్ సిల్క్ శారీని ధరించారు ఉపాసన. బీనా గోయెంకా మెరుగులు దిద్దిన లిలియమ్ నెక్‌పీస్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ప్రకృతిని పరిరక్షించాలన్న ఆలోచన ఉపాసనలో స్వతహాగా ఉంటుంది. కార్బెన్ ఫుట్‌ప్రింట్స్‌తో భూమిని కలుషితం చేయకూడదన్నది ఆమె నమ్మే సిద్ధాంతం. అందుకే ఆమె యాక్సెసరీస్‌లోనూ స్క్రాప్‌తో తయారు చేసిన హ్యాండ్ మేడ్ పొట్లి చోటుచేసుకుంది. ముంబైకి చెందిన డిజైనర్ బినా గోయెంకా సిద్ధం చేసిన లిలియమ్ నెక్‌పీస్ ఉపాసనకు గ్రాండ్ లుక్ తెచ్చిపెట్టింది. దాదాపు నాలుగేళ్ల సమయం పట్టింది ఆ నెక్‌పీస్ డిజైనింగ్‌కి. సుమారు 400 కేరట్ల హై క్వాలిటీ రూబీస్ (400 carats of high-quality rubies), జెమ్ స్టోన్స్, ముత్యాలతో నగిషీలు దిద్దిన నగ అది. అలాంటి నగ మరొకటి ఉండదు. ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను రెండింటిని కాపాడుకోవాలి. ఉపాసనను అలాగే ఆమె మెడలోని నగను అంటూ చమత్కరించారు. ఇలా మొత్తంగా వస్త్రధారణ విషయంలో అద్భుతమైన ప్రతిభావంతులను గుర్తించి, వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, అందరి ప్రశంసలు అందుకుందీ జంట (Indian Artisans).
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అకాడెమీ అవార్డుల గురించి అత్యంత గొప్పగా చెప్పారు. తాను, తన భార్య కేవలం ఈ అవార్డులకు సరదాగా రాలేదని, భారతదేశం ప్రతినిధులుగా హాజరుకావడం ఆనందంగా ఉందని అన్నారు. ‘‘మమ్మల్ని, మా భారతదేశాన్ని (India) ఇక్కడికి ఆహ్వానించినందుకు, ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ఆయన మాటలు, ఆస్కార్ ప్రాంగణంలో భారతీయతను ప్రదర్శించడంలో కలిగిన ఘనతను చాటాయి. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేడుకలో (International Event) చాటుతున్నామనే ఆనందాన్ని ప్రతిబింబించాయి. ఈ ఈవెంట్ వద్ద రామ్ చరణ్, ఉపాసన కలిసి మాట్లాడుతున్న వీడియోలను మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం
*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?
* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్
*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?
*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్
*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?
*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?
*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..