కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chiranjeevi: చిన్ని క్లీంకారతో వినాయక చవితి సెలబ్రేషన్.. పిక్స్ వైరల్

ABN, First Publish Date - 2023-09-18T16:43:15+05:30

వినాయక చవితి పండగను పురస్కరించుకుని సెలబ్రిటీలు ప్రేక్షకులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. అయితే.. ఈసారి తన మనవరాలు క్లీంకారతో కలిసి ఈ ఫెస్టివల్ జరుపుకోవడం చాలా స్పెషల్‌గా ఉందని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

Megastar Chiranjeevi Family in Ganesh Chaturthi Celebrations

వినాయక చవితి (Ganesh Chaturthi) పండగను పురస్కరించుకుని సెలబ్రిటీలు ప్రేక్షకులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ వేదికగా తన ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. అయితే.. ఈసారి వినాయక చవితి స్పెషల్ ఏమిటో కూడా.. ఈ పిక్స్‌తో పాటు మెగాస్టార్ చెప్పుకొచ్చారు. తన మనవరాలు క్లీంకార (KlinKaara Konidela)తో కలిసి ఈ పండగను జరుపుకోవడం ఈసారి స్పెషల్ అంటూ మెగాస్టార్ చిరంజీవి.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌‌లో..

‘‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఈసారి ప్రత్యేకత ... చిన్ని ‘క్లిన్ కారా’తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం. Happy Ganesh Chaturthi to ALL! Celebrating the First Festival with the little ‘Klin Kaara’ this year!!’’ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన పోస్ట్‌ని, ఫొటోలని.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేశారు.


అయితే ఈ ఫొటోల్లో కూడా ఎక్కడా ‘క్లీంకార’ ఫేస్ రివీల్ కానీయలేదు. రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు కలిసి పూజ నిర్వహించినట్లుగా ఈ ఫొటోలను చూస్తే తెలుస్తోంది. పూజ సమయంలో ‘క్లీంకార’ను ఉపాసన తన ఒడిలో ఉంచుకోగా.. మెగా ఫ్యామిలీ సభ్యులందరూ ఆ పాపనే చూస్తూ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి.. ఆ పాపను చూస్తూ.. హాయిగా నవ్వుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కూడా బాస్ ఫ్యామిలీకి ‘వినాయక చవితి’ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Mahima Nambiar: క్యాస్టింగ్ కౌచ్‌పై ఏమందంటే..

***********************************

*Anand Deverakonda: నేనే ఈ టీమ్‌లో కాస్త ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడిని..

************************************

*Keedaa Cola: ఎట్టకేలకు ‘కీడా కోలా’కు మోక్షం లభించబోతోంది..

**********************************

Updated Date - 2023-09-18T16:47:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!