Balagam: ‘బలగం’ ఓటీటీలో విడుదల కాదా? ఈ వివాదమేంటి?
ABN, First Publish Date - 2023-03-04T19:30:39+05:30
దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) బ్యానర్‌లో తెరకెక్కి.. మార్చి 3న థియేటర్లలోకి వచ్చిన ‘బలగం’ (Balagam) చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం..
దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) బ్యానర్‌లో తెరకెక్కి.. మార్చి 3న థియేటర్లలోకి వచ్చిన ‘బలగం’ (Balagam) చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం మరింతగా ముదురుతోంది. ఈ సినిమా కథపై ఆరోపణలు చేస్తున్న జర్నలిస్ట్ కమ్ రైటర్ గడ్డం సతీష్ (Gaddam Satish).. ఇప్పుడు లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఓటీటీలో ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కానివ్వనంటూ హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఈ వివాదంపై ఇండస్ట్రీలో హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి.
‘బలగం’ సినిమా విడుదలకు ముందే వేసిన ప్రీమియర్స్‌కు మంచి స్పందన రావడమే కాకుండా.. తెలంగాణ ప్రజలంతా ఈ సినిమా మాది అని భావిస్తారనేలా టాక్ బయటికి వచ్చింది. దీంతో ఒక తెలంగాణ అభిమానిగా (Telangana Fan) విడుదల రోజు ఈ సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లిన సతీష్ షాకయ్యారు. ఎందుకంటే ఇది.. తను 2011లో రాసిన కథ, 2014లో ఓ న్యూస్ పేపర్‌లో అచ్చయిన ‘పచ్చికి’ (Pachhiki) అనే కథ. అంతే.. ఒక్కసారిగా ఆయన మైండ్ బ్లాంకయింది. ఇదేంటి ఇది నా కథ కదా.. నా ప్రమేయం లేకుండా ఎలా సినిమా తీస్తారంటూ.. మీడియా ముందుకు వచ్చారు. మూలకథ అని తన పేరు టైటిల్స్‌లో వేయాల్సింది.. అలా కూడా జరగలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తునే.. చిత్రయూనిట్ ఈ విషయంపై స్పందించకుండా ఉంటే మాత్రం.. ఖచ్చితంగా లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని ఆయన ఫైర్ అవుతున్నారు.
‘‘ఈ మధ్య చిన్న చిన్న పదాలను పాటలలో వాడుకుంటేనే ఎన్నో గొడవలు చేస్తున్నారు. అలాంటిది నేను రాసిన ‘పచ్చికి’ కథను 90 శాతం తీసుకొని సినిమాగా మార్చారు. ‘బలగం’ సినిమా కథ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి. ఈ విషయాన్ని వారే అధికారికంగా అనౌన్స్ చేస్తే సంతోషిస్తా. లేదంటే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. కోర్టును ఆశ్రయించేందుకు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాను. ఒక జర్నలిస్టుకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏమిటి?’’ అని జర్నలిస్ట్ గడ్డం సతీష్ ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. దిల్ రాజు అండ్ టీమ్ సైడ్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందనా రాలేదు. దర్శకుడు వేణు కూడా ఈ వివాదంపై స్పందించలేదు. దిల్ రాజు మాత్రం ఈ కథకి, ఆ కథకి అస్సలు సంబంధం లేదనేలా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. మంచి కథ తీసుకుని వస్తే.. తనతో కూడా సినిమా తీయడానికి సిద్ధం అని.. ఆయన కామెంట్స్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. మొత్తంగా అయితే ఈ స్టోరీ వివాదం (Balagam Story in Controversy).. ముందు ముందు మరింతగా ముదిరే అవకాశం అయితే లేకపోలేదు. అలాగే.. ఈ వివాదంతో సినిమా అదే స్థాయిలో క్రేజ్‌ను కూడా రాబట్టుకుంటుండటం విశేషం. మరి ఈ వివాదం విషయంలో ఎవరి ‘బలగం’ ఎంతనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ప్రియదర్శి (Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) జంటగా నటించిన ఈ చిత్రంతో కమెడియన్ వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకుడిగా పరిచయమయ్యారు. వేణు యెల్దండి.. ‘జబర్దస్త్ వేణు’గా అందరికీ పరిచయమే. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..
*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?
* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్
* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?
* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం
* Virupaksha Teaser: ప్రమాదాన్ని దాటడానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!
* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్
* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్
* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుతమైన క్షణాలివి
* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు