కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fatima Vijay Antony: నీ జ్ఞాపకాలతో చచ్చిపోతున్నా!.. కుమార్తె మృతిపై భావోద్వేగ పోస్ట్

ABN, First Publish Date - 2023-10-10T13:27:59+05:30

హీరో విజయ్‌ ఆంటోని పెద్ద కుమార్తె ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ఆమె మృతిని ఆ దంపతులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తన కుమార్తె లేని విషయాన్ని తట్టుకోలేక విజయ్‌ ఆంటోని సతీమణి, నిర్మాత ఫాతిమా సోమవారం ఒక ట్వీట్‌ చేశారు. నేను ప్రతి రోజూ నీ జ్ఞాపకాలతో చచ్చిపోతున్నా. నువ్వు లేకుండా జీవించలేను అంటూ ఫాతిమా ఎమోషనల్ అయ్యారు.

Fatima Vijay Antony

హీరో విజయ్‌ ఆంటోని పెద్ద కుమార్తె ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ఆమె మృతిని ఆ దంపతులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తన కుమార్తె లేని విషయాన్ని తట్టుకోలేక విజయ్‌ ఆంటోని సతీమణి, నిర్మాత ఫాతిమా (Fatima Vijay Antony) సోమవారం ఒక ట్వీట్‌ చేశారు. ‘మాతో నువ్వు 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తావని తెలిసివుంటే, నిన్ను నా దగ్గరే ఉంచుకునేదాన్ని. ఆ సూర్యచంద్రులను కూడా నీకు చూపించి ఉండను. నేను ప్రతి రోజూ నీ జ్ఞాపకాలతో చచ్చిపోతున్నా. నువ్వు లేకుండా జీవించలేను. అమ్మానాన్నల వద్దకు తిరిగి రా. నీ చెల్లి లారా నీ కోసం ఎదురు చూస్తోంది. లవ్‌ యూ తంగం’ (Fatima Vijay Antony Letter) అంటూ ట్వీట్‌ చేశారు. కాగా, గతంలో విజయ్‌ ఆంటోని కూడా తన కుమార్తెతో పాటు తాను చనిపోయాను అంటూ ఒక ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అందులో..

‘‘నా పెద్ద కుమార్తె గొప్ప హృదయం గల మనిషి. అంతకుమించి ధైర్యవంతురాలు. ప్రస్తుతం తను కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం‌లేని ప్రశాంతమైన చోటుకి వెళ్లిపోయింది. అయినా ఆమె ఇప్పటికీ నాతోనే ఉన్నట్లుంది. తను చనిపోయినప్పుడే.. తనతో పాటూ నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ఆరంభిస్తాను’’ (Vijay Antony Emotional Letter) అని విజయ్‌ ఆంటోనీ ఓ ఎమోషనల్‌ లేఖను ట్వీట్ చేశారు. ఆ లేఖ చూసిన వారంతా కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే.


కాగా.. పెద్ద కుమార్తె మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ.. హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) తన వల్ల నిర్మాతకు నష్టం రాకూదని, ఆయన శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇటీవల తన చిన్న కుమార్తెతో కలిసి ‘రత్తం’ (Raththam) చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విజయ్ ఆంటోని అండ్ ఫ్యామిలీకి మేమున్నామంటూ ధైర్యంగా నిలబడింది. విజయ్ ఆంటోని అండ్ ఫ్యామిలీ ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Priyamani: ఓటీటీలో దసరా స్పెషల్‌‌గా ప్రియమణి నటించిన పవర్‌ఫుల్ వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

**********************************

*Raghava Lawrence: ఆడియో ఫంక్షన్లకు అభిమానులు రావొద్దు.. లారెన్స్ సంచలన వ్యాఖ్యలు

*******************************

*Lokesh Kanagaraj: ఆ డైలాగ్‌ వివాదానికి పూర్తి బాధ్యత నాదే!

*******************************

*Kangana Ranaut: నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.. కానీ?

******************************

*Sreeleela: కట్ చెప్పిన తర్వాత కూడా అదే ఎమోషన్‌లో ఉండేదాన్ని..

************************************

Updated Date - 2023-10-10T13:27:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!