కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dum Masala: ‘గుంటూరు కారం’ దమ్ మసాలా సాంగ్ టాకేంటి?

ABN, First Publish Date - 2023-11-07T18:11:00+05:30

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు, దిగ్గజ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 13 ఏళ్ళ విరామం తర్వాత ‘గుంటూరు కారం’ సినిమా కోసం కలిశారు. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూడో చిత్రం ‘గుంటూరు కారం’ రాబోయే సంక్రాంతికి రాబోతుండగా.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Mahesh Babu in Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు, దిగ్గజ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) 13 ఏళ్ళ విరామం తర్వాత ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా కోసం కలిశారు. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూడో చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika Hassine Creations) పతాకంపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ (S Radhakrishna) ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో రకరకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. వాటన్నింటిని అధిగమించి.. ‘గుంటూరు కారం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2024 సంక్రాంతి బరిలో దిగబోతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘దమ్ మసాలా’ (Dum Masala)ను మేకర్స్ విడుదల చేశారు.

అటు మహేష్ బాబు (Mahesh Babu)కి, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas)‌కి మంచి ఆడియోలను అందించిన ఎస్.ఎస్. థమన్ (SS Thaman) ఈ భారీ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు ‘దమ్ మసాలా’ వంటి స్పైసీ ట్రాక్‌తో ఫ్యాన్స్‌కి దీపావళి (Diwali) ట్రీట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ లిరికల్ సాంగ్‌ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని నవంబర్ 7వ తేదీ సాయంత్రం 04 గంటల 05 నిమిషాలకు మేకర్స్ వదిలారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతూ.. మిలియన్ల వ్యూస్ రాబడుతోంది.


ఈ పాటకు సరస్వతీ పుత్ర రామ‌జోగ‌య్య శాస్త్రి (Ramajogayya Sastry) సాహిత్యం అందించగా.. సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. పాటలోని సాహిత్యం కథానాయకుడి పాత్ర తీరుని తెలియజేస్తోంది. ‘నా తలరాతే రంగుల రంగోలి. దిగులైనా చేస్తా దీవాలి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి’, ‘నేనో నిశ్శబ్దం, అనునిత్యం నాతో నాకే యుద్ధం’ వంటి లైన్స్ ఫ్యాన్స్‌కు కిక్కిస్తున్నాయి. థమన్ అందించిన ట్యూన్, బీట్ సరికొత్తగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ వంటి నటీనటులు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Ranjana: అందుకే విద్యార్థులను కొట్టా.. నటి రంజనా సంచలన వ్యాఖ్యలు

*************************************

*Venki Mahesh: పక్కపక్కనే పెద్దోడు, చిన్నోడు.. సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పిక్

*************************************

*Srinidhi Shetty: నా అభిమాన నటుడ్ని దగ్గరగా చూసి.. నోట మాట రాలేదు

************************************

Updated Date - 2023-11-07T18:11:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!