కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NT Rama Rao: ఎన్టీఆర్ పేరుతో ఇటుకలు, అభిమాని ఇలా తన ప్రేమని చూపించాడు

ABN, First Publish Date - 2023-11-06T10:19:16+05:30

అభిమానులు తమ అభిమాన నటుడు మీద అనేక రకాలుగా ప్రేమ చూపిస్తూ వుంటారు. రాయలసీమలోని కర్నూలుకి చెందిన ఒక అభిమాని ఎన్టీఆర్ మీద తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు.

A fan of NTR shows his love by making the initials of the actor's name on the bricks

ఎన్ టి రామారావు (NTRamaRao0 'దేవర' #Devara షూటింగ్ లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' #RRR సినిమాకి ముందు ఎన్టీఆర్ తెలుగులో అగ్ర నటుల్లో ఒకరు అయితే, ఆ సినిమా విడుదలయ్యాక ఎన్టీఆర్ (NTR) గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రపంచం అంతా ఎన్టీఆర్ అంటే తెలిసింది, ఆస్కార్ అవార్డుల కోసం అమెరికాలో ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఎన్టీఆర్ స్టార్ ఎట్రాక్షన్ గా నిలిచాడు కూడా. అలాగే రానున్న రోజుల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ (HritikRoshan) తో కలిసి 'వార్' #War హిందీ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ కి 'ఆర్ఆర్ఆర్' తరువాత అభిమానుల సంఖ్య కూడా బాగా పెరిగిన మాట వాస్తవం. ఒక్కోసారి ఈ అభిమానులు తమ అభిమాన నటుడు మీద ప్రేమని వివిధ రకాలైన రూపాల్లో వ్యక్తం చేస్తూ వుంటారు. రాయలసీమ లోని కర్నూలు జిల్లాకి చెందిన ఒక అభిమాని ప్రేమ చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. సాంఘీక మాధ్యమాల్లో ఇప్పుడు ఈ అభిమాని చేసిన పని వైరల్ అవుతోంది.

ఇంతకీ ఈ అభిమాని ఏమి చేసాడో చూడండి. తన ఇంటికోసం కట్టిచుకోవడానికి ఇటుకలు తెప్పించుకున్నాడు, అయితే అవి మామూలు ఇటుకలు కావు, ఒక్కో ఇటుక మీద ఎన్టీఆర్ పేరు చెక్కబడి వుంది. తన ఇల్లు ఆ ఇటుకలతో కట్టుకోవడానికి అతను ఇలా ఎన్.టి. రామారావు ని చిన్నపేరుతో ఎన్టీఆర్ అని పిలుస్తాం కదా, ఆలా ఎన్టీఆర్ పేరు ప్రతి ఇటుకమీద స్పెషల్ గా వేయించుకున్నాడు. ఎన్టీఆర్ మీద ఇలా తన అభిమానం చాటుకున్నాడు ఈ రాయలసీమ అభిమాని.

కొరటాల శివ (KoratalaSiva) దర్శకత్వంలో 'దేవర' షూటింగ్ లో బిజీ గా వున్న ఎన్టీఆర్ మొదటి పార్టు వచ్చే ఏప్రిల్ 5 న విడుదలకి సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) ఇందులో విలన్ గా నటిస్తుండగా, జాన్వీ కపూర్ (JanhviKapoor) కథానాయికగా నటిస్తోంది.

Updated Date - 2023-11-06T10:19:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!