Kissing actress in a public platform: మరీ ఇంత దిగజారుడా, అందరి ముందు దర్శకుడు అమ్మాయితో అంత అసభ్యంగా ప్రవర్తించడమా
ABN, First Publish Date - 2023-08-29T17:18:53+05:30
రోజు రోజుకీ తెలుగు సినిమా పరిశ్రమలో వింత చేష్టలు ఎక్కువయ్యాయి. ఆమధ్య ఒక రైటర్, దర్శకుడు ఒక నటిని హగ్ అడిగాడు, నిన్న ఒక దర్శకుడు అందరూ చూస్తుండగా ఒక కథానాయికతో అసభ్యంగా ప్రవర్తించాడు. వీళ్ళకి గట్టిగా మందలించేవాళ్ళు పరిశ్రమలో లేరా అని నెటిజన్స్ అడుగుతున్నారు
ఈమధ్య సినిమా ఫంక్షన్స్ లో మరీ దిగజారుడు పనులు చేస్తున్నారు కొంతమంది సినిమా సెలెబ్రెటీస్. ఈ పోకడ రాను రాను ఎక్కువయిపోతోంది, అదీ పబ్లిక్ గా జరిగే ఫంక్షన్ లో ఆలా చెయ్యడం వలన, ప్రేక్షకులకి, ప్రజలకి ఏమి చెప్పాలని అనుకుంటున్నారో? అసలే సినిమా పరిశ్రమ అంటే చాలా నెగటివ్ వుంది, దానికి తోడు ఇలా పబ్లిక్ గా ఒక సెలబ్రిటీ చెడ్డగా ప్రవర్తిస్తే అది అతనికీ కాదు, మొత్తం పరిశ్రమకే చెడ్డ పేరు వస్తుంది అనే భావం ప్రజలకి వస్తుంది, అంతే అటువంటి ప్రవర్తన వలన ఆ వ్యక్తికీ చెడ్డ పేరు తప్ప ఉపయోగం ఏమీ ఉండదు.
రాజ్ తరుణ్ (RajTarun) కథానాయకుడిగా 'తిరగబడరా సామీ’ #TiragabadaraSaami అనే సినిమా రూపొందుతోంది, దీనికి ఎఎస్ రవికుమార్ చౌదరి (ASRavikumarChowdary) దర్శకుడు, మల్కాపురం శివకుమార్ (MalkaShivakumar) నిర్మాత. ఇందులో మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా (MannaraChopra) కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయి, ప్రచార చిత్రాలు మొదలు పెట్టాలి అనుకొని, ముందుగా ఈ చిత్రం టీజర్ విడుదల చేసింది. దీనిని ప్రముఖ నిర్మాత, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు అయిన దిల్ రాజు (DilRaju) విడుదల చేశారు.
అయితే ఇదే ఫంక్షన్ లో చూస్తున్న మీడియా వాళ్ళు, వీక్షిస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యే సంఘటన జరిగింది. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి, ఒక కథానాయిక అయిన మన్నార చోప్రా బుజం మీద చెయ్యి వేసి మాట్లాడుతూ హఠాత్తుగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఇది ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో చాలా వైరల్ అవ్వటమే కాకుండా, ఒక పెద్ద చర్చకు కూడా దారితీసింది. ఇలా అందరూ చూస్తుండగా దర్శకుడు, ఆలా ఒక కథానాయికకు ముద్దు పెట్టడం అందరినీ విస్మయానికి గురి చేసింది. వెంటనే మన్నారా షాక్ అయి, ఏమీ చెప్పలేక ఉండిపోయింది. ఆమె కూడా ఊహించలేదు దర్శకుడు అలా చేస్తాడని. ఆమెకి ఎంతో ఇబ్బంది అనిపించింది, అయినా ఆమె అంతమంది ముందు అతన్ని ఎందుకు అనటం అని ఊరుకుంది అని అనుకుంటున్నారు.
ఇంతకు ముందు ఒక రైటర్, దర్శకుడు ఒక కథానాయకురాలిని హగ్ కావాలని అడిగాడు పబ్లిక్ గా. ఇంకో నటుడు అమ్మాయిలు కనపడితే కడుపైనా చెయ్యాలి, ముద్దయినా పెట్టాలి అంటాడు. ఇంకో నటుడు ఒక సినిమా ఫంక్షన్ లో బూతు అర్థం వచ్చే విధంగా చేతులతో సంజ్ఞలు చేసి మాట్లాడుతాడు. ఇంకో నటుడు తనకి ఆ కథానాయిక అంటే ఎంత ఇష్టమే చెపుతూ ఉంటాడు. అసలు సినిమా పరిశ్రమ ఏమి చెపుతోంది, సినిమా పరిశ్రమలోని పెద్దలు వీళ్ళని పిలిచి గట్టిగా మందలించడం లాంటివి చెయ్యరా? అని నెటిజన్స్ అడుగుతున్నారు.
నటీనటుల, సాంకేతిక నిపుణల మధ్య ఎంతటి స్నేహం వున్నా అది పబ్లిక్ ఫంక్షన్ లలో ఇలా చూపించాల్సిన అవసరం అయితే లేదు అని అంటున్నారు. పబ్లిక్ లో ఒక అమ్మాయితో ఎలా ప్రవర్థించాలో కూడా తెలియని దర్శకుడు మరి ఆ సినిమాకి ఎలా దర్శకత్వం వహించాడు అని కూడా అడుగుతున్నారు.