కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయి ఎవరో తెలుసా...

ABN, Publish Date - Dec 19 , 2023 | 04:54 PM

ఈమధ్య కాలంలో తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాలలో బాగానే మెరుస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలో కనపడుతున్న అమ్మాయి కూడా తెలుగు అమ్మాయే, ఈమధ్యనే విడుదలైన ఒక పెద్ద సినిమాలో నటించింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా...

ఈమధ్యనే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' #ExtraOrdinaryMan సినిమా విడుదలైంది కదా. నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన ఈ సినిమాకి వక్కంతం వంశీ (VakkanthamVamsi) దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రారంభంలోనే నితిన్ ని బావా అని అంటూ పిలుస్తూ నన్ను వదిలెయ్యవు కదా అని కొంటెగా అంటూ వున్న అమ్మాయి గుర్తుందా. 'నువ్వు కొలిచే ఆ మైసమ్మ సాక్షిగా నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలెయ్యవు కదా' అంటూ చెప్పిన పూజ పాత్ర గుర్తుంది కదా.

ఆ పూజ పాత్ర వేసింది మరెవరో కాదు ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయి దాక్షి గుత్తికొండ. ఆ సినిమాలో చిన్న పాత్ర అయినా, అందులో బాగా మెరిసింది దాక్షి. ఆమె పాత్రే కథలో కీలకం, మలుపు తిప్పిన పాత్ర కూడా అవటం ఆసక్తికరం. (Dakkshi Guttikonda)

దాక్షి సినిమాలకి ఏమీ కొత్తకాదు. మూడు సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా, అగస్య మంజు దర్శకత్వంలో వచ్చిన 'కరోనా వైరస్' అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. అందులో పోషించిన పాత్రకి దాక్షికి అందరూ ప్రశంసించారు. ఆ పాత్రలో దాక్షి నటించిన తీరు చూసి రామ్ గోపాల్ వర్మ ఎంతో ప్రశంసించారు. 'నువ్వు బాగా నేచురల్ గా చేస్తావు' అని దాక్షితో అన్నారు.

ఫ్యాషన్ డిజైనింగ్ లో ఒకటిన్నర సంవత్సరాలు కోర్సు చేసిన దక్ష తరువాత మోడలింగ్ లోకి ఎంటర్ అయింది. కొన్ని వ్యాపారాత్మక ప్రచార వీడియోలకి దక్ష పని చేసింది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో కూడా చేసింది, ఇంకో వెబ్ సిరీస్ లో నటించబోతోంది.

విజయవాడకి చెందిన దాక్షి తెలుగు అమ్మాయి. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి తెలుగు పరిశ్రమలో మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. తాను గ్లామర్ పాత్రలకి కూడా సరిపోతాను, చేస్తాను అని చెప్పే విధంగా ఇప్పుడు ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫోటో షూట్ తో అందరి దృష్టిలో పడింది దాక్షి.

Updated Date - Dec 19 , 2023 | 04:54 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!