కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devil controversy: దర్శకుడి ట్వీట్ అతన్ని ఉద్దేశించి అన్నదేనా...

ABN, First Publish Date - 2023-09-15T18:55:02+05:30

'డెవిల్' సినిమా వివాదం మరోసారి తెరకెక్కింది. ఈ సినిమాకి ఇప్పుడు దర్శకుడు, నిర్మాత పేరు అభిషేక్ నామా వేసుకున్నాడు. అయితే ఈ సినిమాకి ముందుగా అనుకున్న దర్శకుడు నవీన్ మేడారం ఒక ట్వీట్ చేసాడు, అది ఇప్పుడు వైరల్ అయింది.

A still from Devil

నందమూరి కళ్యాణ్ రామ్ (NandamuriKalyanRam), సంయుక్త (Samyuktha) జంటగా నటిస్తున్న సినిమా 'డెవిల్' #Devil. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ #BritishAgent గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా ప్రచార చిత్రాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి, అలాగే ఈ సినిమా కూడా కొంచెం వివాదంలో వుంది. వివాదం ఎందుకంటే, ఈ సినిమా దర్శకుడిగా మొదటి నవీన్ మేడారం (NaveenMedaram) అని అధికారికంగా ప్రకటించారు. అలాగే మొదట్లో విడుదలైన ప్రచార చిత్రాల్లో కూడా దర్శకుడిగా అతని పేరే వేశారు.

మరి ఏమైందో ఏమో, దర్శకుడు నవీన్ కి, నిర్మాత అభిషేక్ నామాకి (AbhishekNama) మధ్య కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయని అంటున్నారు. నవీన్ తరపున అతనిది తప్పు కాదు, నిర్మాతే అతన్ని బాగా ఇబ్బంది పెట్టాడు అని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ చేస్తుండగానే నవీన్ కి వేరే సినిమా ఆఫర్ వచ్చి వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చారని, అది నిర్మాతకి ముందు చెప్పలేదని, అందుకే నిర్మాతకి కోపం వచ్చి ఇబ్బంది పెట్టాడని ఒక వార్త వచ్చింది.

దీనికి భిన్నంగా నిర్మాత తరపున అతని టీము నవీన్ మేడారం వేరే సినిమా వొప్పుకొని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాడు అందుకే అతన్ని తీసేయవలసి వచ్చింది అని వివరణ ఇస్తున్నారు. నవీన్ మొదటి షెడ్యూల్ వరకే వచ్చాడని ఆ తరువాత సెట్స్ మీదకే రావటం మానేసాడు అని అంటున్నారు. అయితే ఇందులో ఏది నిజమో, ఏది అబద్దమే వాళ్ళకే తెలియాలి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ మీద దర్శకుడు, నిర్మాత అని అభిషేక్ నామా తన పేరే వేసుకున్నాడు.

ఇదిలా ఉండగా సాంఘీక మాధ్యమంలో నవీన్ మేడారం హిందీలో రాసిన ఒక వాక్యం ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించింది. అది కొంచెం వైరల్ కూడా అవుతోంది. ఇంతకీ అతను రాసింది ఏంటంటే 'వినాశకాలే విపరీత బుద్ధి'. ఇది పురాతనకాలం నాటి నానుడి, మరి ఇది ఎవరిని ఉద్దేశించి నవీన్ ట్వీట్ చేసాడో. కానీ నెటిజన్స్ మాత్రం ఇది ఆ సినిమా నిర్మాతని ఉద్దేశించి పెట్టాడు అని మాత్రం అంటున్నారు. ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వుంది, అలాగే విడుదలకి కూడా సిద్ధంగా వుంది.

Updated Date - 2023-09-15T18:55:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!