కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest: దర్శకుడు దేవ కట్టా సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబు అరెస్ట్ మీదే అంటూ వైరల్

ABN, First Publish Date - 2023-10-13T17:43:46+05:30

దర్శకుడు దేవ కట్టా సాంఘీక మాధ్యమంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృస్తిస్తున్నాయి. అవి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు మీద చేసిన వ్యాఖ్యలు అని నెటిజన్స్ అంటూ, వైరల్ చేస్తున్నారు

Director Deva Katta

తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు దేశం పార్టీ (TeluguDesamParty) తో అనుబంధం వున్నవాళ్లు, అలాగే చంద్రబాబు నాయుడు (ChandrababuNaidu) తో వ్యక్తిగతంగా అనుబంధం వున్నవాళ్లు మాత్రమే చంద్రబాబు అక్రమ అరెస్టు పై స్పందించారు. కానీ దర్శకుడు దేవ కట్టా (DevaKatta) ఈరోజు తన సాంఘీక మాధ్యమంలో ఒక ట్వీట్ పెట్టి సంచలనం రేపారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అది ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు మీద స్పందించిన తీరు అని అందరూ అంటున్నారు.

దేవ కట్టా ఒక కళాత్మక దర్శకుడు, అంటే తన సినిమాలో ఎక్కువ సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగా కథలు తీసుకొని తన సినిమాలలో ఏవ్ చెప్తాడు. తన రెండో సినిమా 'ప్రస్థానం' #Prasthanam రాజకీయ నేపథ్యంలో తీసి సంచలనం సృష్టించాడు దేవా కట్టా. ఈమధ్య అతను సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) తో దర్శకత్వం వహించిన 'రిపబ్లిక్' #Republic అనే సినిమా కూడా ప్రేక్షకులని ఆలోచింపచేసే చిత్రంగా మలిచారు.

అటువంటి దర్శకుడు అయిన దేవ కట్టా ఈరోజు ఒక ట్వీట్ చేశారు. దానిలో చాలా నిగూడార్థం వుంది, అలాగే తన సినిమాలు ఎలా ఆలోచింపచేస్తాయో ఈ ట్వీట్ కూడా అంతే ఆలోచింప చేసే విధంగా వుంది. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముంది అంటే, "ప్రజాస్వామ్యం: నేరం రుజువయ్యే వరకు మీరు దోషి కాదు!! నియంతృత్వం: నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషులే!!" అని ట్వీట్ చేశారు దేవ కట్టా.

ఇప్పుడు దీని మీద చర్చలు జరుగుతున్నాయి, ఇది చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకి సంబంధించి ఈ ట్వీట్ పెట్టారని అంటున్నారు నెటిజన్స్. అలాగే జగన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక డిక్టేటర్ లా ప్రవర్తిస్తున్నారని కూడా నెటిజన్స్ అంటున్నారు.

Updated Date - 2023-10-13T17:44:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!