CWC23Final: మహేష్ బాబు ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలంటూ మీమ్స్.. ఎందుకంటే?
ABN, First Publish Date - 2023-11-19T11:52:03+05:30
వన్డే ప్రపంచకప్‌లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరుకు అహ్మదాబాద్ వేదికగా అంతా సిద్ధమైంది. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా జట్టు కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని కోరుతూ పూజలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ నేపధ్యంలో సోషల్ మీడియా వేదికగా అనేక సెంటిమెంట్స్ బయటికి వస్తున్నాయి. అందులో మహేష్ బాబు సెంటిమెంట్ కూడా ఒకటి.
వన్డే ప్రపంచకప్ (Cricket World Cup 2023)లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఫైనల్ పోరుకు అహ్మదాబాద్ వేదికగా అంతా సిద్ధమైంది. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా జట్టు కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని కోరుతూ పూజలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ నేపధ్యంలో సోషల్ మీడియా వేదికగా అనేక సెంటిమెంట్స్ బయటికి వస్తున్నాయి. అందులో మహేష్ బాబు సెంటిమెంట్ (Mahesh Babu Sentiment) ఒకటి. అదేమిటని అనుకుంటున్నారా? అవును మరి.. అమితాబచ్చన్ (Big B) నేను మ్యాచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుందని ఓ సెంటిమెంట్‌ని స్వయంగా ఆయనే రివీల్ చేశారు. అలానే కొన్ని ఉంటాయి. వాటిలో మహేష్ బాబు (Mahesh Babu) సెంటిమెంట్ కూడా ఒకటి. అదేమిటంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar)తో కలిసి 2011లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ (CWC2011 Final) మ్యాచ్‌కు హాజరయ్యారు. ఆ మ్యాచ్‌లో భారత్ విజయ పతాకం ఎగురవేసి చరిత్ర సృష్టించింది. అలాంటి చరిత్ర మళ్లీ రిపీట్ కావాలంటే.. మరోసారి మహేష్ తన భార్య నమ్రతతో కలిసి ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) సందడి చేయాలని కొందరు మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఈ మీమ్స్ (Memes) బీభత్సంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ అభిమానులు కొందరు.. ప్లీజ్ మహేష్ అన్నా.. మీరు మ్యాచ్ చూడడానికి వెళ్లండి అంటూ రిక్వెస్ట్‌లు కూడా పెడుతున్నారంటే.. సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో.. 140 కోట్ల భారతీయుల కల.. మహేష్ మీకు అర్థమవుతుందా?
కాగా, ఈ మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI) ప్లాన్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఈ మ్యాచ్‌ని చూసేందుకు అంతర్జాతీయ స్థాయిలోని ప్రముఖులు హాజరవుతున్నట్లుగా ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వారే కాకుండా పలువురు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన తారలెందరో స్టేడియంలో సందడి చేయనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan), స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వంటి వారంతా అహ్మదాబాద్ (Ahmedabad) నరేంద్ర మోదీ స్టేడియానికి క్యూ కట్టినట్లుగా సమాచారం.
ఇవి కూడా చదవండి:
========================
*Raghava Lawrence: రజనీ రూపంలో రాఘవేంద్రుడిని చూశా..
*******************************
*Hi Nanna Party: పోటీలోకి ‘హాయ్ నాన్న’ పార్టీ.. మేనిఫెస్టో విడుదల
*******************************
*Rajinikanth: ‘ముత్తు’ రీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. థిల్లాన థిల్లాన దుమ్మురేపుతుందా..
*******************************
*Siren Teaser: మంచోడు.. మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా?
********************************