Daggubati Venkatesh: వెంకటేష్ రెండో కుమార్తె నిశ్చితార్ధం, మహేష్, చిరంజీవి సందడి, ఫోటోస్ వైరల్
ABN, First Publish Date - 2023-10-26T11:00:09+05:30
దగ్గుబాటి వారి ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరగనున్నాయి. అన్నదమ్ములు సురేష్ బాబు, వెంకటేష్ ఇద్దరి ఇంట్లో ఈ వేడుకలు జరగబోతున్నాయి. సురేష్ బాబు కుమారుడు అభిరాం వివాహం డిసెంబర్ మొదటి వారంలో శ్రీలంకలో జరగనుంది, ఇప్పుడు వెంకటేష్ రెండో కుమార్తె నిశ్చితార్ధం జరిగింది, వివాహం కూడా త్వరలోనే అని అంటున్నారు. రెండు పెళ్లిళ్లతో దగ్గుబాటి ఇంట్లో సందడి నెలకొంది.
నటుడు వెంకటేష్ (Venkatesh) తన సినిమా కెరీర్ ని, వ్యక్తిగత కెరీర్ ని ఎప్పుడూ కలపరు, రెండు వేరు వేరుగా చూస్తారు, అలానే ఉంచుతారు. తన వ్యక్తిగత జీవితం, తన కుటుంబం గురించి ఎక్కడా ఎక్కువ ప్రస్తావించరు, వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇస్తారు. అది మొదటి నుండీ వెంకటేష్ అలా చేసుకుంటూ వస్తూ వచ్చారు. అందుకే అతని వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి బయట వాళ్ళకి, ముఖ్యంగా మీడియా వాళ్ళకి అంతగా తెలియదు.
వెంకటేష్ మొదటి కుమార్తె ఆశ్రిత (Aashritha) వివాహం కూడా మీడియా వాళ్ళకి దూరంగా జరిపించారు. సంబరంగానే చేశారు, కానీ మీడియా లో ఎక్కువ ఫోటోస్ రాకుండా జాగ్రత్త పడ్డారు, పిల్లలకి ఇవ్వాల్సిన ప్రైవసి ఇస్తారు. ఇప్పుడు రెండవ కుమార్తె హవ్య వాహిని (HavyaVahini) నిశ్చితార్ధం విజయవాడలో జరిగింది, ఇది కూడా మీడియా వాళ్ళకి తెలియదు, చాలా గోప్యంగా ఉంచారు. సాంఘీక మాధ్యమంలో వచ్చిన వార్తలు, ఫోటోస్ చూసి ఎవరెవరు హాజరయ్యారో తెలిసింది, అంతే కానీ ఈ నిశ్చితార్ధం కూడా చాలా గోప్యంగా చేశారు వెంకటేష్.
ఈ నిశ్చితార్థంలో దగ్గుబాటి #DaggubatiFamily వారి ఇంట రెండు పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేష్ అన్న, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (SureshBabu) కుమారుడు అభిరాం (DaggubatiAbhiram) వివాహం డిసెంబర్ మొదటి వారంలో శ్రీలంకలో జరగనుంది. ఇప్పుడు వెంకటేష్ రెండో కుమార్త్ వివాహం కూడా త్వరలోనే జరగబోతోంది. అంటే దగ్గుబాటి వారి ఇంట రెండు వివాహాలు జరగబోతున్నాయని అర్థం అవుతోంది.
విజయవాడలో జరిగిన నిశ్చితార్ధానికి చిత్ర పరిశ్రమ నుండి మెగా స్టార్ చిరంజీవి (MegaStarChrianjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) హాజరయ్యారు. వారిద్దరూ అక్కడ బాగానే సందడి చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే రానా దగ్గుబాటి (RanaDaggubati), నాగ చైతన్య (NagaChaitanya) కూడా వీళ్ళతో పాటు వున్నారు.
ఇక కొంతమంది రాజకీయ నాయకులూ కూడా హాజరయినట్టుగా తెలిసింది. వెంకటేష్, మహేష్ బాబు కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో నటించి మళ్ళీ మల్టీ-స్టారర్ సినిమాలకి పునాది వేశారు చాలా సంవత్సరాల క్రితం.
ఆ సినిమా నుండి మహేష్, వెంకటేష్ ఇద్దరూ బాగా సన్నిహితంగా వున్నారు. మహేష్ ని చిన్నోడు అని, వెంకటేష్ ని పెద్దోడు అనీ ఆ సినిమాలో పాత్రలతో చాలా చోట్ల ఇద్దరూ పిలుచుకునే వారు. అలాగే ఇద్దరూ ఎన్నోసార్లు కలుసుకునేవారు కూడా. ఆ తరువాత మహేష్ బాబు సినిమా ఫంక్షన్స్ కి వెంకటేష్ ముఖ్య అతిధిగా కూడా వచ్చారు. ఇలా ఇద్దరి స్నేహం బాగా దగ్గరవడం, కుటుంబ సభ్యుల్లా కలిసిపోవడం, అందుకనే మహేష్ బాబు, వెంకటేష్ కుమార్తె నిశ్చితార్ధానికి హాజరవటం జరిగింది. ఇక చిరంజీవి ఎప్పటి నుండే వెంకటేష్ కుటుంబానికి బాగా దగ్గరివారు అవటం వలన అతను కూడా హాజరయ్యారు.